Facebook friend cheated church pastor for about rs 6 lakh

anantapur, facebook, andhra pradesh, fraud, Nigerian, donation, 5.8 lakhs, church pastor

Facebook friend cheated church pastor for about Rs. 6 lakh

ఫేస్‌బుక్‌ స్నేహం: రూ. 6 లక్షలు శఠగోపం..

Posted: 10/26/2014 11:14 AM IST
Facebook friend cheated church pastor for about rs 6 lakh

ఫేస్‌బుక్‌ ఒక సోషల్ వెబ్ సైట్ అని దానిలో అకౌంట్ వున్న ప్రతీ వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. లేదంటే చాలా కష్టాలను కొని తెచ్చుకున్నవారవుతారు. ఇప్పటికే యువత ఈ సోషల్ వెబ్ సైట్ లో తమ నగ్న సెల్ఫీలను పెట్టి.. అర్థతరంగా జీవితాలను బుగ్గీపాలు చేసుకుంటున్న ఘటనలను మనం చూస్తున్నాం. ఈ కోవాలోనే పెద్దలు కూడా తమ అభిరుచులు కలసిని వారితో స్నేహం పెరుతో గంటల కోద్ది చాట్ చేస్తున్నారు. స్నేహం ముదిరి పాకన పడుతుందన్న దశలో.. తమకేదో ఉపద్రవం ముంచుకోచ్చిందని, అత్యవసరంగా డబ్బులు కావాలని కోరుతుంటారు. ఈ తరహాలో ఇప్పటికినే పలు రకాలుగా మోసాలు వెలుగుచూసినా.. ఇంకా కనువిప్పు కలగకపోతే మాత్రం తీవ్రంగా నష్టపోతారు. ఎలాగంటారా.. ఇదిగో ఇలా..

ఫేస్‌బుక్‌ ద్వారా 2013 అక్టోబర్‌ 7న నైజీరియాకు చెందిన జాషువా ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయ్యాడు. మోసెస్‌ చర్చి పాస్టర్‌గా పనిచేస్తున్నాడని, నిడిగల్లులో సరైన ప్రార్థనామందిరం లేదని తెలుసుకున్న జాషువా, తనకు విదేశాల నుంచి చర్చిలు కట్టించే సంస్థతో పరిచయాలున్నాయని, వారు చర్చిల నిర్మాణానికి నిధులు ఇస్తారని మోసెస్‌ను నమ్మించాడు. 5.4 మిలియన్‌ డాలర్ల డబ్బు తమ వద్ద ఉందని, అందులో 20 శాతం చర్చికి ఇస్తామని తెలిపాడు. భారత రిజర్వు బ్యాంకులో నెట్‌బ్యాంకింగ్‌ ఖాతా తెరవడానికి యాంటీ టెర్రరిస్ట్‌ క్లియరన్స్‌ సర్టిఫికెట్‌, కాట్‌కోడ్‌ తదితర ఖర్చుల పేరుతో రూ.5,80,700 పలు దఫాలుగా పలు ఖాతాలకు మోసెస్‌ ద్వారా బదిలీ చేయించుకున్నాడు.

చివరికి 2014 సెప్టెంబర్‌ 16న ఫోన్‌ చేసి ఢిల్లీకి చెందిన తన స్నేహితుడు జార్జ్‌ యాకోబ్‌ నీ కోసం ఎదురుచూస్తున్నాడని, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ క్లియరెన్స్‌ కోసం రూ.5.45 లక్షలు చెల్లిస్తే డబ్బులు వెంటనే తిరిగి వస్తాయని జాషువా చెప్పడంతో అతడిపై అనుమానం వచ్చిన మోసెస్‌ ఇంతవరకు తాను డబ్బు చెల్లించిన ఖాతాలు సరైనవేనా అని ఆర్‌బీఐని సంప్రదించాడు. ఇవన్నీ నకిలీవని ఆర్‌బీఐ తేల్చేసింది. దీంతో మోసెస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను చర్చి సభ్యుల వద్ద నుంచి చందాలు వసూలు చేసి వారికి డబ్బు చెల్లించానని, ఈ మొత్తాన్ని రికవరీ చేయించాలని పోలీసులను కోరాడు. ఇలావుంటాయి మోసాలు. ముందే అతను పంపించిన అకౌంట్ సరైనవేనా అని చూసుకుని వుంటే మోసెస్ నష్టపోయేవాడు కాదు. అంతేకాదు ఇప్పుడా డబ్బును తిరిగి చర్చి అకౌంట్ లో జమచేయాలంటే తానెంత కష్టపడాలో..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anantapur  facebook  andhra pradesh  fraud  Nigerian  donation  5.8 lakhs  church pastor  

Other Articles