Longest serving mla in maharashtra scores a record 11th win

Ganpatrao Deshmukh, PWP, Sangola seat, Maharashtra, peasents and workers party, sholapur

longest serving mla in maharashtra scores a record 11th win

చరిత్ర సృష్టించిన రాజకీయ కురువృద్దుడు..

Posted: 10/19/2014 07:24 PM IST
Longest serving mla in maharashtra scores a record 11th win

మహారాష్ట్రలో అత్యధికాలం ఎమ్మెల్యేగా ఉన్న పీసెంట్స్ అండ్ వర్కర్ పార్టీ(పీడబ్ల్యూపీ) ఎమ్మెల్యే , ఎనభై ఎనమిదేళ్ల గణపతిరావ్ దేశ్ముఖ్ చరిత్ర సృష్టించారు. అత్యధికసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సరికొత్త రికార్డు సృష్టించారు. 11సార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1962 నుంచి ఆయన విజయాలను నమోదు చేసుకుంటునే వున్నారు.మధ్యలో 1972, 1995లలో జరిగిన ఎన్నికలలో మాత్రమే ఆయన ఓటమిని చవిచూశారు.

తాజాగా జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సోలాపూర్ జిల్లాలోని సంగోలా స్థానం నుంచి ఆయన గెలుపొందారు. శివసేన అభ్యర్థి సాహాజిబాపు పటేల్ ను 25,224 ఓట్ల తేడాతో ఓడించారు. గణపతిరావ్ కు 94,374 ఓట్లు, సాహాజిబాపుకు 69,150 ఓట్లు వచ్చాయి. మహారాష్ట్ర ఎన్నికలలో దేశ్ ముఖ్ ల ఓటు బ్యాంకు గండి పడునుందన్న వార్తనుల ఆయన తోసిరాజుతూ మరోమారు విజయబావుటా ఎగురవేశారు.

సంగోలా నియోజకవర్గం నుంచి 54 ఏళ్లుగా దేశ్ముఖ్ ప్రాతినిథ్యం వహిస్తుండడం విశేషం. తాజా విజయంతో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. కరుణానిధి పది పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలువగా.. గణపత్ రావ్ దేశ్ ముఖ్ సరికోత్త రికార్డును తన పేరున నమోదు చేసుకున్నారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ganpatrao Deshmukh  PWP  Sangola seat  Maharashtra  peasents and workers party  sholapur  

Other Articles