Ncp ready to give outside support to bjp says praful patel

NCP, Maharashtra assembly election, BJP, Narendra Modi, modi mania, shiv sena, congress, MNS

ncp ready to give outside support to bjp says praful-patel

బీజేపితో మైత్రికి ఉత్సా:హంతో ఎన్సీపి ఉరుకులు..

Posted: 10/19/2014 07:27 PM IST
Ncp ready to give outside support to bjp says praful patel

మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు జోరుగా మారుతున్నాయి. అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకపక్క అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఓట్ల లెక్కింపు జరుగుతుండగా మరోపక్క రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన మెలిక పెట్టి కూర్చుంటే.. మరోవైపు బద్దశత్రువు కాంగ్రెస్ తో 15 ఏళ్ల పాటు మైత్రిని కొనసాగించి అధికారాన్ని పంచుకున్న నేషనల్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపితో జతకట్టడానికి ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది.

బీజేపీకి బయట నుంచి మద్దతు ఇస్తామని శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రకటించింది. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలన్నదే తమ ఉద్దేశమని అందుకనే బీజేపికి బయటి నుంచి మద్దతు ఇప్తామని తెలిపింది. ఈ మేరకు ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. కాంగ్రెస్ తో మైత్రి చెడిపోవడంతో ఈ ఎన్నికల్లో ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేసింది. ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోడీ మొదలుకుని బీజేపి పార్టీ నేతలు ఎన్సీపీపై విమర్శలు వర్షం కురిపించినా.. అవి ఎన్నికల వరకే పరిమితమంటున్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత ఎవరైనా ప్రజా పాలనకు, ప్రభుత్వ ఏర్పాటు పైనే దృష్టి పెట్టాలన్నారు.

అయితే మహారాష్ట్రంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గంటాపథంగా చెబుతున్న బీజేపి, శివసేనతో కలసి నడుస్తుందా..? లేదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన కలసిరాని పక్షంలో తాము ఎన్సీపీ మద్దతు తీసుకోమని ఇప్పటికే ఆ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ ప్రకాష్ జావదేకర్ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లనే ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమన్నారు. అయితే అధికార పీఠాన్ని శివసేన డిమాండ్ మేరకు రెండున్నరేళ్లు వారికి ఇస్తారా..? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. లేఖ ఎన్పీపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్సీపీ అందించే స్నేహ హస్తాన్ని బీజేపి అందుకుంటుందా..? లేదా అనేద వేచి చూడాలి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NCP  Maharashtra assembly election  BJP  Narendra Modi  modi mania  shiv sena  congress  MNS  

Other Articles