Maharastra voter shocks shivsene

Maharastra, BJP, Narendra Modi, modi mania, shiv sena,

maharastra voter shocks shivsene

శివసేనకు షాక్ ఇచ్చిన మహారాష్ట్ర ఓటరు..

Posted: 10/19/2014 12:27 PM IST
Maharastra voter shocks shivsene

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలో తామే అత్యథఇక స్థానాలను గెలిచి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటామన్న శివసేన షాక్ కు గురైంది. ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకోవాలన్న ఆ పార్టీ ఆశలపై ఓటర్లు నీళ్లు చల్లారు. ఒంటరిగానే మెజారిటీ స్థానాలను సాధిస్తామనుకున్న ఆ పార్టీ ఆశలు అడియాశలయ్యాయి. దీర్ఘకాలంగా భారతీయ జనతా పార్టీతో ఉన్న అనుబంధాన్ని సైతం తెగతెంపులు చేసుకుని తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన శివసేనకు ఆశించిన మేర ఫలితాలు రాలేదు. బీజేపితో పొత్తు పెట్టుకోకుండా బరిలోకి దిగిన శివసేన కేవలం రెండో స్థానాన్ని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎన్నికల ముందుకు బీజేపితో సీట్ల కేటాయింపు విషయంలో శివసేన గట్టి పట్టుపట్టింది. తాము చెప్పినన్ని సీట్లు కేటాయించాల్సిందేని, లేకపోతే ఒంటరిగానే పోటీ చేయడానికి వెనుకాడబోమని ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. సీట్ల సర్దుబాటు విషయంలో ఇరు పార్టీలకు మధ్య సయోధ్య కుదరక పోవడంతో చివరకు బీజేపి, శివసేనలు ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాయి. ఉద్ధవ్ తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని ప్రకటించడంతో పాటు కేవలం తమ సంప్రదాయ ఓటింగ్‌నే శివసేన నమ్ముకుందని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి సాధారణ ఛాయ్ వాలా దేశ ప్రధాని అయినప్పుడు.. తాను ముఖ్యమంత్రిని కాలేనా..? అని ఆయన బీజేపినే అధికంగా టార్గెట్ చేశారు. అయినా అనుకున్న ఫలితాలు అందకపోవడంతో డీలాపడ్డారు.

ప్రధాని మోడీ మానియా ముందు శివసేన అటలు సాగలేదు. అటు బీజేపి మాత్రం మోదీ, అభివృద్ధి నినాదాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లింది. మరోపక్క కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా వేర్వేరుగా బరిలోకి దిగడం శివసేనకు కొంతమేర లాభించినా బీజేపితో పొత్తు విడిపోవడంతో మూల్యం చెల్లించుకోక తప్పలేదు. బీజేపితో పొత్తు పెట్టుకుని ఉంటే కాషాయదళ ఓట్లతో శివసేన మరిన్ని స్థానాల్లో విజయం సాధించి ఉండేది. తాజా ఫలితాలు శివసేన పార్టీకి కొంత మింగుడుపడని విషయమైనా, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపితో చేతులు కలపక తప్పదు. బీజేపి, శివసేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharastra  BJP  Narendra Modi  modi mania  shiv sena  

Other Articles