Modi mania worked out once again bjp arrives as largest party in both states

Maharastra, Haryana, BJP, Narendra Modi, modi mania, BJP Leading, congress, shiv sena, MNS, NCP, INLD, independents, voters, favour

modi mania worked out once again, bjp arrives as largest party in both states

పనిచేసిన మోడీ మానియా.. రెండు చోట్లా బీజేపిదే హవా..

Posted: 10/19/2014 11:07 AM IST
Modi mania worked out once again bjp arrives as largest party in both states

ప్రధాని నరేంద్రమోడీ మానియా మళ్లీ పనిచేసింది. ఉప ఎన్నికలలో కొంత మేరకు ప్రభావాన్ని చూపలేకపోయినా.. మహారాష్ట్ర, హర్యానాల్లో మోడీ తన సత్తాను తిరిగి చాటుకున్నారు. రెండు రాష్ట్రాలలో బీజేపీ దూసుకుపోతోంది. ఓట్ల లెక్కింపులో ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీ ఆధిక్యతలో ఉంది. ప్రత్యర్థుల అంచనాలకు మించి తమ పార్టీ విజయపథాన నడిపేందుకు ప్రధాని మోడీ చేసిన కృష్టిని ప్రజలు గుర్తించారు. బీజేపికి మద్దతుగా ప్రజలు తీర్పునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలలో మోడీని ప్రధానిగా చేయాలన్న ప్రజలు ఆయనకు ఏకపక్ష మోజారిటీని అందించగా, రెండు రాష్ట్రాల ఎన్నికలలో మాత్రం ప్రత్యర్థులు కొంత పుంజుకున్నారని చెప్పవచ్చు.సుమారుగా దశాబ్దమున్నర కాలం తరువాత మహారాష్ట్రలో బీజేపి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుండగా, హర్యానాలో తొలిసారిగా అన్ని స్థానాలకు పోటీ చేసిన బీజేపి అధికారాన్ని ఒంటరిగానే హస్తగతం చేసుకునే దిశగా పరుగులు తీస్తోంది.

మోడీ మానియా మసకబారిందని, తాము ఎన్నికలలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్కు ఘోర పరాజయం మిగలనుంది. రెండు రాష్ట్రాల్లో అధికారంలో వున్న ఆ పార్టీ అధికారం జారవిడుచుకోనుంది. మహారాష్ట్రలో  288 స్థానాలకు, హర్యానాలో 90 స్థానాలకు ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ ఇరు రాష్ట్రాల్లో ప్రజల విశ్వాసం కొల్పోయింది. మహారాష్ట్రలో అన్ని పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగగా, బీజేపి అతిపెద్ద పార్టీగా అవతరించనునంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో 113 స్థానాలలో బీజేపి దూసుకువెళ్తండగా, అధికారంలో వున్న కాంగ్రెస్ మాత్రం కేవలం 46 స్థానాలు పరిమితం కానుంది. రెండో స్థానాన్ని అక్రమించిన శివసేన 60 స్థానాలన కైవసం చేసుకునే దిశగా పయనిస్తోంది. కాగా ఎన్సీపీ పార్టీ మాత్రం కాంగ్రెస్ తో మూడో స్థానానికి పోటీ వడుతోంది.

మహారాష్ట్రలో అధికారంలోకి రావడానికి 145 స్థానాలు అవసరం కాగా ఏ పార్టీకి ఓటరు స్పష్టమైన తీర్పును ఇవ్వలేదు. స్వతంత్రులతో పాటు రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పార్టీ 25 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం వుంది. ఎంఎన్ఎస్ నాలుగు స్థానాలు. ఇతరులు 21 స్థానాలను కైవసం చేసుకోనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన కలసిరాని పక్షంలో ఎన్సీపీ సహా ఇతరులను కలుపుకుని బీజేపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వుందని రాజకీయ విశ్లేషకులు అంచానా వేస్తున్నారు. ఇదే జరిగితే మహారాష్ట్ర రాజకీయ చరిత్రలోనే తొలి బీజేపీ ముఖ్యమంత్రిని ప్రజలు చూడబోతున్నారన్నది వాస్తవం.

అటు హర్యానాలో 90 స్థానాలకు బీజేపి తొలిసారిగా అన్ని స్థానాలకు పోటీ చేసింది. హర్యాన ప్రజలు ప్రధాని మోడీని విశ్వసించారు. ఈ నేపథ్యంలో బీజేపికి హర్యానా ఓటర్లు ఏకపక్ష మెజారిటఅని అందించనున్నారు. 90 స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన 46 స్థానాల కన్నా నాలుగు స్థానాలు ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం హర్యానాలో బీజేపి 50 స్థానాలతో దూసుకుపోతుండగా, అధికార కాంగ్రెస్ కేవలం 15 స్థానాలకు పరిమితమై మూడోస్థానంలో కొనసాగుతోంది. ఓం ప్రకాశ్ చౌతాలా నేతృత్వంలోని ఐఎన్ఎల్డీ పార్టీ 20 స్థానాలతో రెండో స్థానాంలో కొనసాగుతోంది. ప్రత్యర్థి పార్టీల గాలి మేడలను కూల్చుతూ.. బీజేపి మరోమారు తన సత్తా చాటుకుంది. ప్రజలు తమ వైపే వున్నారన్న ప్రధాని వ్యాఖ్యాలను నిజం చేస్తూ ఓటరు మహాశయులు కూడా రెండు రాష్ట్రాల్లో బీజేపీ వైపే నిలిచారు.

రెండు రాష్ట్రాల్లోనూ బీజేపికే అధికార ఫీఠం దక్కుతుందన్న అంచానాలతో ఆయా రాష్ట్రాల కార్యాలయాలతో పాటు ఢిల్లీలోని బీజేపి కేంద్ర కార్యాలయంలోనూ సంబరాలు మిన్నంటాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేణులు, నాయకులు పార్టీ కార్యాలయాల్లో మిఠాయిలు పంచుకున్నారు. బాణాసంచా పేల్చి తమ అనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. పలువురు నాయకులు రంగులు చల్లుకుని సంతోషాన్ని వెలిబుచ్చారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharastra  Haryana  BJP  Narendra Modi  modi mania  BJP Leading  congress  shiv sena  MNS  NCP  INLD  independents  voters  favour  

Other Articles