Supreme court to hear jayalalithaa bail plea

Jayalalithaa, Chennai jail, Parappana Agrahara, Supreme Court, bail petition

supreme court to hear jayalalithaa bail plea

‘సుప్రీం’లో విచారణకు రానున్న జయలలిత కేసు..

Posted: 10/17/2014 07:44 AM IST
Supreme court to hear jayalalithaa bail plea

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. అన్నా ఢిఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ పిటీషన్ ఇవాళ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు రానుంది. జయలలిత బెయిల్ పిటీషన్ను దాఖలు చేసిన ఆమె తరపు న్యాయవాదులు ఈ పిటీషన్ అత్యవసరంగా విచారించాల్సిన జాబితాలో చేర్చాలని అభ్యర్థించడంతో న్యాయస్థానం ఇవాళ్టికి వాయిదా వేసింది.

మరోవైపు జయలలితను బెంగళూరు జైలు నుంచి చెన్నై జైలుకు తరలించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆమెను పరప్పణ ఆగ్రహారం జైలు నుంచి చెన్నైకి తరలించాలని పిటిషన్ లో కోరారు. జర్నలిస్ట్ హెరీన్ ప్రేస్ దీన్ని దాఖలు చేశారు. జయకు జైలు శిక్ష పడిన తర్వాత తమిళనాడులో ఆందోళనలు, బంద్ లు జరిగాయని తెలిపారు. జయ మద్దతుదారులు సాగించిన హింసాకాండలో పలువురు ప్రాణాలు కోల్పోయారని, ఆస్తుల ధ్వంసం జరిగిందని వెల్లడించారు.

జయలలిత దోషిగా తేలడం, జైలు శిక్ష ఖరారు కావడం, పరప్పనా అగ్రహార జైలులో శిక్ష అనుభవించడానికి కన్నడీగులకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కావేరీ జలాల పంపిణీ వివాదంలోనే అమెను జైలుకు పంపారని తమిళనాడులో వెలసిన పోస్టర్లను, వాటిలో పేర్కోన్న హెచ్చరికలను జర్నలిస్టు హెరీన్ ప్రేస్ అత్యన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. కావేరీ జలాల పంఫిణీ వంటి సున్నిత విషయాలను దృష్టిలో పెట్టుకుని జయను సొంత రాష్ట్రానికి పంపించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ పిటీషన్ పై కూడా సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ జరపనుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalithaa  Chennai jail  Parappana Agrahara  Supreme Court  bail petition  

Other Articles