Musharraf comments on india and kashmir

musharraf on india, musharraf kashmir, musharraf on kargil war, musharraf on modi, musharraf latest comments, india pakistan issues, india pakistan war, pakistan army attack on india border, narendra modi on pakistan, latest updates, india latest updates, pakistan latest news

pak ex president musharraf comments on kashmir, india and pakisthan :pakistan former president musharraf again made controversial statements against inda and kashmir he says that ik kashmir always some of issues must happen than only pak will have chance to fight with sub continent if pak and kashmir becomes one to fight with India than victory will comes by pak side

కాశ్మీర్ పాక్ కలిస్తే భారత్ ఖేల్ ఖతం

Posted: 10/17/2014 07:54 AM IST
Musharraf comments on india and kashmir

పాక్ నియంతగా పేరొందిన కార్గిల్ యుద్ధ కారకుడు ముషార్రఫ్ మరోసారి భారత్ పై విషం చిమ్మారు. ఉపఖండంపై తనకు ఉన్న పగ, కసిని మరోసారి మీడియాతో వెల్లడించారు. కాశ్మీర్ ప్రజలను ఎప్పుడూ ఏదో ఒక అంశంతో రెచ్చగొడుతూనే ఉండాలన్నారు. కాశ్మీర్లో వివాదాలు జరగటమే పాక్ కు లాభం కల్గిస్తుందని చెప్పారు. భారత్, పాక్, కాశ్మీర్ అంశాలపై ఓ మీడియా సంస్థతో ప్రత్యేకంగా ఇంటర్య్వూలో మాట్లాడిన ముషార్రప్ ఈ కామెంట్లు చేశాడు.

అంతేకాకుండా కాశ్మీర్ లో పోరాటాలు చేసేవారికి పాక్ ఎఫ్పుడూ సహాయ సహకారాలు అందించాలన్నారు. కాశ్మీర్ లో పోరాటాలు చేసే యువతతో పాక్ సైన్యం కలిస్తే.., భారత్ ను ఎదుర్కోవటం చాలా సులభం అవుతుందన్నారు. తద్వారా పాక్ ఎఫ్పుడూ భారత్ పై దాడి చేసేందుకే ఎదురుచూస్తుంది అని పరోక్షంగా స్పష్టం చేశాడు. పాక్ చావుదెబ్బతిన్న కార్గిల్ యద్ధానికి కారకుడైన ముషార్రఫ్ పదవిని వీడినా ఉపఖండంపై తన శత్రుత్వంను మాత్రం మానుకోలేదు. గతంలో కూడా కార్గిల్ యుద్దం, కాశ్మీర్ అంశాలపై పలుమార్లు విషం కక్కారు.

ఇక ప్రధాని నరేంద్రమోడిపై కూడా పాక్ మాజి సైనికాధ్యక్షుడు విమర్శలు చేశారు. మోడి ఓ మతవాది అని విమర్శించారు. భారత ప్రధాని ఒక మతానికి అనుకూలంగా వ్యవరిస్తారు అని ఆరోపించారు. భారత్ తో శాంతిని కోరుకుంటున్నామని చెప్తున్న పాక్ సరిహద్దులో మాత్రం రోజూ దొంగదెబ్బతీసేందుకు కాచుకుని కూర్చుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మాజి అధ్యక్షుడి కామెంట్లతో మరోసారి రెండు దేశాల మద్య మాటల యుద్ధానికి తెరలేచింది. ముషార్రఫ్ కామెంట్లపై పాక్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : musharraf  india  pakistan  kashmir  

Other Articles