Mate jagadguru mahadevi on rapes in india

mate jagadguru mahadevi, mate jagadguru mahadevi on rapes, rapes in india, prostitution in india, indian prostution lifes, sexual assults, india latest updates, westren culture in india, indian culture, courts on sexual cases

mate jagadguru mahadevi comments on rapes : lingayat caste worshipped mate jagadguru mahadevi of karnataka told that regularise prostution and dont wear western dresses than rapes will comes down accordingly

వ్యభిచారం చట్టబద్దం చేయమని అమ్మ చెప్తోంది

Posted: 10/15/2014 05:58 PM IST
Mate jagadguru mahadevi on rapes in india

దేశంలో రోజురోజుకూ అత్యాచారాలు.., అమ్మాయిలపై దాడులు పెరుగుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయటం ఎలా అని ప్రభుత్వం.., స్వచ్చంద సంస్థలు ప్రజలంతా సింపుల్ సలహాలతో అత్యాచారాలకు అడ్డుకట్ట వేయవచ్చు అని ఓ మాత సెలవిచ్చింది. కర్ణాటకలో లింగాయత్ వర్గ ప్రజలు ఎక్కువగా విశ్వసించే బసవదర్మ పీఠాధిపతి మాతా జగద్గురు మహాదేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యభిచారం చట్టబద్దం చేస్తే సరి ఇక రేప్ అనే మాట ఉండదు అని అమ్మ చెప్తోంది. ఒకడుగు ముందుకు వేసి వ్యభిచారాన్ని చట్టబద్దం చేయాలి అని కర్ణటక సర్కారును కోరుతోంది కూడా ఈ మహాదేవి.

అటు అమ్మాయిలు పాశ్చాత్య పోకడలు, విదేశాల్లో మాదిరిగా ఒళ్ళు కన్పించేలా బట్టలు వేసుకోవటం వల్ల కూడా అత్యాచారాలు పెరుగుతున్నాయట. కాబట్టి విదేశీ వస్ర్తాల వాడకం తగ్గిస్తేనే రేప్ లు తగ్గుతాయి... లేదంటే లెక్కలు పెరుగుతాయి అని భయపెడుతోంది. కర్ణాటకలోని ధర్వాడ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన జగద్గురు మహాదేవి మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలను కొందరు కిలాడి లేడీలు స్వార్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ చట్టాలను దుర్వినియోగం చేయటంతో పాటు మహిళల పరువు తీస్తున్నారని మండిపడింది.


వ్యభిచారాన్ని చట్టబద్దం చేయాలంటున్న ఈ మాత వ్యాఖ్యలపై కర్ణాటకలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మహిళా సంఘాలు, పలు విద్యార్ధి సంఘాలు మహాదేవిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడాల్సిన ఆధ్యాత్మిక ప్రభోదకులు ఇలా వ్యభిచారాలను ప్రోత్సహించేలా కామెంట్లు చేయటం ఏంటని మండిపడుతున్నారు. గతంలో కూడా మహిళల వస్ర్తాలు, వేషాధారణపై కామెంట్లు చేసిన ప్రతి ఒక్కరూ విమర్శల పాలవటం గమనార్హం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mate jagadguru mahadevi  rapes  prostitution  latest updates  

Other Articles