10 years old sadik as city police commissioner

Hyderabad, Police, Mahender Reddy, Karimnagar district, Telangana, Sadiq, K. Chandrasekhara Rao, Make a wish foundation, CP, commissioner of police

A dream comes true for terminally ill sadik, as he becomes City Police Commissioner

పదేళ్ల బుడతడు.. పోలీస్ కమీషనఃర్ అయ్యాడు..!

Posted: 10/15/2014 05:38 PM IST
10 years old sadik as city police commissioner

ఆ బుడతడికి సరిగ్గా పదేళ్లే.. కానీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ అయ్యాడు. ఇవాళ బాధ్యతలు చేపట్టిన బుడతడు.. పోలీసుల గౌరవ వందనం కూడా స్వీకరించాడు. అదేంటి పదేళ్లకు పదో తరగతి కూడా పాస్ అవ్వరు.. ఏకంగా ఫోలీసు కమీషనర్ ఎలా అయ్యాడని అనుకుంటున్నారా..? హైదరాబాద్ పోలీస్ కమీషనర్ గా  ఒక్క రోజు విధులు నిర్వహించే అరుదైన అవకాశం సాదిఖ్ అనే పదేళ్ల బాలుడికి కల్పించారు మేక్ ఎ విష్ పౌండేషన్ వారు. అందుకు హైదరాబాద్ పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి కూడా సమ్మతించారు. దీంతో సాధిక్ కు అరుదైన అవకాశం దక్కింది.

సాదిక్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనికి పోలీస్ కమీషనర్ కావాలన్నది కోరిక. తన కోరికను తన తల్లిదండ్రులకు చెప్పాడు. సాధిక చివరి కోరికను తీర్చడం తమ వల్ల కాదని నిట్టూరస్తున్న తరుణలో మేక్ ఎ విష్ పౌండేషన్ సాధిక్ కోరిక గురించి తెలుసుకున్నారు. విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీపీ మహేందర్‌రెడ్డికి తెలిపారు. అతను బాలుడి కోరికను నెరవేర్చారు. ఇవాళ ఉదయం తన ఇంటికి వచ్చిన బుగ్గకారులో కమిషనర్ కార్యాలయానికి వెళ్లాడు.

ఈ బుల్లి కమిషనర్కు అక్కడ రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లు సాదిక్కు గౌరవ వందనం చేసారు.  అక్కడి నుంచి సీపీ ఛాంబర్‌లోకి వెళ్లి సీపీ సీటులో ఆశీనులయ్యారు. కోరికను తీర్చడం వల్లబాలుడి ఆరోగ్యం మెరుగుపడి జీవితకాలం మరికొంత పెరుగాలని తాను అకాంక్షిస్తున్నట్లు పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి అశాభావం వ్యక్తం చేశారు. సాదిఖ్ చివరి కోరిక తీర్చేడంలో సహకరించిన పోలీస్‌శాఖ, స్వచ్ఛంద సంస్థలకు సహకరించినందుకు బాలుడి తండ్రి రహీమొద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles