Bjp to be single largest party in maharastra and haryana

BJP, congress, survey, maharashtra, haryana, INLD, shivsena, NCP, India TV, C^voter, opinion poll

bjp to be single largest party in maharastra and haryana, survey

ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలోనూ హంగ్ ఫలితాలు..

Posted: 10/11/2014 08:45 AM IST
Bjp to be single largest party in maharastra and haryana

మహారాష్ట్ర, హర్యానాలలో ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరగుతున్న ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాలను కైవసం చేసుకుంటోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇండియా టీవీ, సీ-ఓటర్ ఒపీనియన్ పోల్ చేసిన సర్వేలో మహారాష్ట్రలో అధిక స్థానాలను కైవసం చేసుకోనున్న బీజేపి, హర్యానాలో మాత్రం అధికారాన్ని హస్తగతం చేసుకోనుందని అంచనా వేసింది. ఏకపక్ష మెజారిటీ సీట్లు మాత్రం బీజేపీకి దక్కకపోవచ్చని అభిప్రాయపడింది.

మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు గాను.. బీజేపీకి 132-142 మధ్య సీట్లు రావచ్చని ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. అలాగే శివసేనకు 50-60 సీట్లు, ఎన్సీపీకి 31-41 సీట్లు, కాంగ్రెస్‌కు 38-48 సీట్లు, ఎంఎన్‌ఎస్ 8-14 సీట్లు, చిన్న పార్టీలు, స్వతంత్రులకు 3-9 సీట్లు రావచ్చని తమ సర్వేను ఉటంకిస్తూ ఇండియా టీవీ ఓ ప్రకటనలో తెలిపింది. ఓట్ల శాతం పరంగా చూస్తే బీజేపీకి 28 శాతం, శివసేనకు 19.7 శాతం, ఎన్సీపీకి 13.7 శాతం, కాంగ్రెస్‌కు 21.2 శాతం, ఎంఎన్‌ఎస్‌కు 7 శాతం రావచ్చని సర్వే పేర్కొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 144 సీట్లలో గెలవగా బీజేపీ-శివసేన కూటమి 90 సీట్లలో గెలుపొందింది. ఇతరులు 54 చోట్ల గెలిచారు. అయితే మహారాష్ట్రలో బీజేపి-శివసేన పోత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా వున్నాయి.

మరోవైపు 90 సీట్లున్న హర్యానాలో బీజేపీ 34 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఓం ప్రకాశ్ చౌతాలాకు చెందిన ఐఎన్‌ఎల్‌డీ 27 సీట్లతో రెండో స్థానంలో నిలవచ్చని, అధికార కాంగ్రెస్ 16 సీట్లకే పరిమితం కావచ్చని అభిప్రాయపడింది. ఇతర పార్టీలు మిగిలిన స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకోగా ఐఎన్‌ఎల్‌డీ 31 సీట్లు, బీజేపీ 4 సీట్లు, హెచ్‌జేసీ, హెచ్‌జేపీ 6 సీట్లు, ఇతరులు 9 సీట్లలో గెలిచారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  congress  survey  maharashtra  haryana  INLD  shivsena  NCP  India TV  C^voter  opinion poll  

Other Articles