How is jayalalithaa in jail

Jayalalithaa, 4 years jail, agrahara jail, tamilnadu, bail petition, karnataka high court, number 7402, cell number 23, general prisoner

how is jayalalithaa in jail

అగ్రహార జైలులో జయలలిత ఏం చేస్తున్నారు..

Posted: 10/08/2014 05:43 PM IST
How is jayalalithaa in jail

సెప్టెంబర్ 27 వరకు ముఖ్యమంత్రిగా అధికార దర్పం అనుభవించిన జయలలిత.. ప్రస్తుతం పరప్పనా అగ్రహారం జైలులో ఖైదీగా జైలు జీవితం గడుపుతున్నారు. జయలలితకు ఖైదీ నెంబర్ 7402 కేటాయించిన అధికారులు సెల్ నెంబరు 23ను కేటాయించారు. ఈ కోసులో శిక్ష అనుభవిస్తున్న జయలలిత స్నేహితురాలు శశికళ, సుధాకరన్కు 7403, సుధాకరణన్కు 7404, ఇళవరసుకు 7405 నెంబర్లను జైలు అధికారులు కేటాయించారు.

జైలులో తొలిరోజున నిద్రలేమితో బాధపడిన జయలలిత.. ఆ తరువాతి రోజునుంచి బాగానే నిద్రించారు. బోజన విషయంలో నిరాడంబర ఆహారాలనే స్వీకరిస్తున్నారు. బ్రౌన్ బ్రెడ్, పాలు, పళ్ళు, బిస్కట్స్, చపాతీలు తింటున్నారు. ఉదయం త్వరగా నిద్రలేని కాసేపు జైలు ఆవరణలోనే వాకింగ్ చేస్తున్నారు. తొలుత ప్రత్యేక కుర్చీని నిరాకరించినా, ఆ తర్వాత అనుమతించారు.

జయలలితకు ఎటువంటి విఐపి ట్రీట్ మెంట్ లభించడం లేదని, ఆమెను సాధారణ ఖైదీలలాగే ట్రీట్ చేస్తున్నామని జైళ్ళశాఖ డిఐజీ పి.ఎం.జైసింహ తెలిపారు. తనకు సౌకర్యవంతమైన గది కావాలని జయలలిత ఏమీ అడగలేదని జైలు అధికారులు తెలిపారు, వైద్యుల సూచనల మేరకు ఇనుప మంచం మాత్రం కావాలని అడిగారని, దానిని సమకూర్చినట్లు జైలు వర్గాలు తెలిపాయి. సాధారణ ఖైదీలాకు కేటాయించే కామన్ టీవీ కూడా అడగలేదు అని తెలిపారు. ఎసి గాని, ఇతర ప్రత్యేక సదుపాయాలు కాని ఏమీ ఏర్పాటు చేయలేదని చెప్పారు. కాగా, ఇదే జైలులో వున్న జయలలిత స్నేహితురాలు శశికళ, అమె అవసరాలను కనిపెట్టుకుని ఉంటున్నారని తెలిపారు.

స్నానాధికాలు పూర్తయిన తరువాత మూడు ఇంగ్లీషు పత్రికలు క్రమం తప్పకుండా చదువుతున్నారని తెలిపారు. ఎంత హోదాలో ఉన్నవారైనా జైలులోకి చేరిన తరువాత వారి వారి హోదా ప్రకారం జైలు జీవితం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత్రిగా , సిని నటిగా భోగభాగ్యాలతో తులతూగిన జయలలిత చివరకు సాధరణ ఖైదీలా శిక్షను అనుభవించడం విధి విచిత్రం కాకపోతే మరేంటి...

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles