Hud hud heading towards odisha andhra coast

Cyclone Hud Hud, Odisha cyclone, Cyclone Bay of Bengal, Andhra Pradesh, Odisha, IMD cyclone update,

Cyclone 'Hud Hud' heading towards Odisha-Andhra coast, landfall by Oct 12

అప్రమత్తం: హుడ్ హుడ్ వచ్చేస్తోంది జాగ్రత్తా..!

Posted: 10/08/2014 04:22 PM IST
Hud hud heading towards odisha andhra coast

మరో పెను తుఫాను కోస్తా తీరాన్ని తాకనుంది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండం మారి తుపానుగా రూపాంతర చెంది అండమాన్, నికోబార్ దీవుల తీర ప్రాంతాన్ని బుధవారం తాకింది. ఈ నెల 12 లేదా మరో రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా ప్రాంతం, ఒడిశా రాష్ట్ర తీరాలను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర అండమాన్ సముద్ర తీరంలో బుధవారం ఉదయం ఏర్పడిన అల్ప పీడనం తుపానుగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్, నికోబార్ తీర ప్రాంతం మయాబందర్ తీరానికి మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో తుపాను తాకిడికి గురైందని తెలిపారు.

రానున్న 24 గంటల్లో తుపాను పెనుతుఫానుగా తీవ్ర రూపం దాల్చనుందని చెప్పారు. పశ్చిమ, వాయవ్య దిశగా తుపాను కదులుతోందని తెలిపారు. అక్టోబర్ 12లోపు భారత తూర్పు తీరాన్ని తాకే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా తీరం, ఒడిశాలోని కళింగపట్నం, పారదీప్ తీరాలకు అక్టోబర్ 12 రాత్రి వరకు తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. తీర ప్రాంతాల్లో 175-185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కోల్‌కతా రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసినట్లు వారు తెలిపారు.

ఒడిశా తీర ప్రాంత జిల్లాలతోపాటు 16 జిల్లాల కలెక్టర్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. తుపాను వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురిక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస శిబిరాల ఏర్పాటు, తదితర విషయాలపై సత్వర చర్యలు చేపట్టాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఒడిశా ప్రభుత్వం తెలియజేసింది. ఎలాంటి విపత్కర పరిణామాలైనా ఎదుర్కొనేందుకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం సిద్దంగా వుంది. తుఫాను ప్రభావిత జిల్లాలలో 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం జిల్లా యంత్రాగాన్ని ఆదేశించింది.

ఇటు ఆంధ్ర‌ప్రదేశ్ ప్రభుత్వం కూడా తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించింది. మత్స్యకారులు సముద్రంలో వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది. కోస్తా జిల్లాల కలెక్టర్లు, అధికారులకు, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles