Anil ambani joins swachh bharat campaign invites nagarjuna sania mirza

Narendra Modi, Anil Ambani, Swachh Bharat, Clean India, broom, Church gate station, nagarjuna, sania mirza

anil ambani joins swachh bharat campaign invites nagarjuna sania mirza

సానియా మిర్జా, నాగార్జులను అనీల్ అంబానీ ఆహ్వనం..!

Posted: 10/08/2014 05:48 PM IST
Anil ambani joins swachh bharat campaign invites nagarjuna sania mirza

ప్రముఖ వాణిజ్యవేత్త, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనీల్ అంబానీ చీపురు పట్టారు. ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ పిలుపు మేరకు ముంబాయిలోని చర్చ్ గేట్ స్టేషన్ బయట చీపురు పట్టి శుభ్రం చేశారు. ప్రధాని పిలుపు మేరకు ఏడాదిలో 100 రోజులు శుభ్రతా కార్యక్రమాల్లో పాల్టొంటానన్నారు. తన స్నేహితులతో కలసి ఉదయాన్నే వచ్చిన అంబానీ.. చర్చ్ గేట్ స్టేషన్ ఆవరణను శభ్రపర్చారు. స్వచ్ఛ భారత్ పథకం విజయవంతమయ్యేందుకు అంకితభావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా అనీల్ చెప్పారు.

అనంతరం ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని పలువురు సెలెబ్రెటీలకు సవాల్ విసిరారు. ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్, బాలివుడ్ నటుడు హృతిక్ రోషన్, బాక్సింగ్ ఛాంఫియన్ మేరీ కోమ్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, శోభా డే, ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా, పాటల రచయిత ప్రషన్ జోషి, టాలీవుడ్ హీరో నాగార్జునలతో పాటు రన్నర్స్ క్లబ్ ఆఫ్ ఇండియాను ఆహ్వానించారు.

మరోవైపు అనీల్ అంబానీని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనటాన్ని మోడీ ప్రశంసించారు. అనీల్ అంబానీ, ఇతరులతో కలిసి చర్చ్గేట్ స్టేషన్ వద్ద పరిశుభ్రం చేయటం మంచి ప్రయత్నమని ఆయన ట్విట్ చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం పదుల సంఖ్యలో మొదలై దేశవ్యాప్తం కావాలని మోడీ ఆకాంక్షించారు. మహాత్ముడు కలలు గన్న క్లీన్ ఇండియాకు దోహదపడే ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ అక్టోబర్ 2న గాంధీజీ జయంతి సందర్భంగా ప్రారంభించారు. అదే రోజున వివిధ రంగాలకు చెందిన 9 మంది ప్రముఖులకు మోడీ సవాల్ విసరగా వారిలో ఒకరైన అంబానీ ఇవాళ సవాల్ ను స్వీకరించి స్వచ్ఛా భారత్ లో పాల్గొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Anil Ambani  Swachh Bharat  Clean India  broom  Church gate station  nagarjuna  sania mirza  

Other Articles