Telangana government to give citizen id cards to the people of the state

telangana, telangana state, telangana government, telangana news, telangana latest updates, telangana state schemes, telangana government schemes, telangana citizen cards, telangana citizens id cards, latest news, kcr, kcr government, kcr family, kcr comments, telangana survey, telangana details, kcr funny comments, kcr images, kcr funny images, andhrapradesh, telangana movements, fast scheme, fast scholarship apply

telangana government decides to give seperate citizen cards to the people of telangana : there is another contrversy decission taken by telangana government that to issue separate id cards to the people of telangana

ప్రత్యేక గుర్తింపు కార్డులు దేనికి..

Posted: 10/08/2014 08:36 AM IST
Telangana government to give citizen id cards to the people of the state

తెలంగాణ ప్రభుత్వం మరోసారి వివాదస్పద నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు భారతీయులందరికి ఒకే పౌరసత్వం ఉండేది. ఇది దేశ రాజ్యాంగంలో పొందుపర్చబడింది. కాని తెలంగాణ ప్రభుత్వం తమ ప్రజలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రకటించింది. మంగళవారం కలెక్టర్లు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. త్వరలోనే తెలంగాణ ప్రజలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తుందని ప్రకటించారు. దీనిపై ఎన్నో ఆందోళనలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కార్డుల వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

తెలంగాణ ప్రజలందరికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తామన్న కేసీఆర్.., సమగ్ర సర్వే వివరాల ఆధారంగా వీటిని అందిస్తామన్నారు. అంతేకాదు ఈ కార్డుల ద్వారానే ఇకపై సంక్షేమ పధకాలు, తెలంగాణలో ఇతర సౌకర్యాలను పొందుతారు అని ప్రకటించారు. అంటే పౌరసత్వ కార్డు ఉంటేనే ప్రజలకు భవిష్యత్తు ఉంటుంది లేకపోతే.. వారి మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందన్నమాట. ఇక్కడే అనుమానాలు వస్తున్నాయి. అదేమంటే.., సమగ్ర సర్వే ఆధారంగా కార్డులు ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి సర్వేలో తెలంగాణ వారితో పాటు ఇతర ప్రాంతాలనుంచి వచ్చి స్థిరపడిన వారు కూడా పాల్గొని పేర్లు నమోదు చేయించుకున్నారు. వారికి ప్రత్యేకంగా కార్డులు ఇస్తారా.., లేక అందరికి ఒకే రకమైన కార్డులు ఇస్తారా అనేది స్పష్టంగా తెలియదు.

ప్రత్యేక పౌరసత్వ కార్డులు ఇస్తే మాత్రం... తెలంగాణలో వారికి ఇక సంక్షేమ పధకాలు పొందే అవకాశం ఉండదు అని అంతా భయపడుతున్నారు. అటు ఫాస్ట్ పధకం ప్రకారం ఫీజు చెల్లించాలంటే 1956కు ముందు నుంచి ఇక్కడ ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది అని కేసీఆర్ ప్రకటించారు. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది కూడా. అయితే ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గే ఉద్దేశ్యంలో లేదు. మరి ఇలాంటి సందర్బంలో ప్రత్యేక పౌరసత్వ కార్డులు ఇచ్చి.. అందులో మళ్లీ తెలంగాణవారికి ప్రత్యేక కార్డులు..., సీమాంధ్రవారికి ప్రత్యేక కార్డులు ఇస్తే ఇక్కడ ఉన్న సీమాంద్ర ప్రజలు వివక్షకు గురయినవారు అవుతారు.

తాజా పరిణామాలు చూస్తే.., ఉమ్మడి రాష్ర్ట సీఎంగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటలు నిజం అవుతుందా అనే ఆందోళన వ్యక్తం అవుతుంది. భవిష్యత్తులో తెలంగాణకు రావాలంటే సీమాంధ్ర ప్రజలు వీసాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అప్పట్లో వైఎస్ అన్నారు. ఇప్పుడు దాదాపు ఇదే జరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఉమ్మడి రాష్ర్టంలో ఉన్న ఊరిని వదిలిపెట్టి.., ఆస్తులు అమ్ముకుని బతుకులు మార్చుకుందామని భాగ్యనగరానికి ఎంతోమంది సీమాంధ్ర ప్రజలు వచ్చారు. వారు ఇఫ్పుడు ఏపీకి చెందిన పౌరులు కాదు. అక్కడకు వెళ్ళినా వారి పిల్లలకు ఏపీ స్థానికత వర్తించదు. ఇటు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు అని వారిని మరింత భయపెడుతుంది. రాజ్యాంగంలో లేని నిర్ణయాన్ని అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ తాజా వైఖరిపై న్యాయస్థానాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  citizenship card  latest news  kcr  

Other Articles