Differences increases between pm narendra modi and pawan kalyan

narendra modi, pawan kalyan, swachch bharat programme, india politics, ap politics, narendra modi pawan kalyan, pawan kalyan narendra modi news, narendra modi swachch bharat

differences increases between pm narendra modi and pawan kalyan : why modi didn't call pawan on swatch bharath programme

పవన్, మోడీకి మధ్య చిచ్చుపెట్టిన ‘‘స్వచ్ఛ్ భారత్’’!

Posted: 10/07/2014 09:45 PM IST
Differences increases between pm narendra modi and pawan kalyan

జనసేనాధిపతి - పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్రమోడీ మధ్య వున్న సంబంధం ఎటువంటిదో అందరికీ తెలిసిందే! సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పవన్ పార్టీ పెట్టినప్పటకీ ఆయన ఎన్నికల బరిలో దిగకుండా బీజేపీ పార్టీకి తనవంతు పూర్తి మద్దతును ప్రకటించి, ఆ పార్టీ ప్రచారకర్తగా కొనసాగిన విషయం విదితమే! దేశాభివృద్ధి త్వరగా మెరుగుపడాలంటే అందుకు మోడీ అధికారంలోకి రావాల్సిందేనంటూ పవన్ ఎన్నో ప్రచారాలను కొనసాగించారు. దీంతో వీరిమధ్య చెరగని బంధం ఏర్పడింది. పవన్, మోడీకి మంచి ఆప్తుడిగా పేరు సంపాదించారు. మొత్తంగా పవన్ బీజేపీ పార్టీకి బాగానే మద్దతు పలికారు. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. మోడీ, పవన్ మధ్య చెడిందనే వార్తలు జోరందుకుంటున్నాయి.

అమెరికా పర్యటన అనంతరం భారత్ లో అడుగుపెట్టిన వెంటనే గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోడీ ‘‘స్వచ్ఛ్ భారత్’’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. స్వయంగా ఆయనకూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం దేశంలో 9మంది ప్రముఖులకు ఛాలెంజ్ విసిరారు. వారిలో సినీప్రముఖులు సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, ప్రియాంకచోప్రాలతోపాటు సచిన్ టెండూల్కర్, అనిల్ అంబానీ, బాబా రాందేవ్ తదితరుల పేర్లూ వున్నాయి. కానీ పవన్ కల్యాణ్ పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. మోడీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో కూడా పవన్ కు ఆహ్వానం పంపలేదు. గతకొన్నిరోజుల నుంచి మోడీ కూడా పవన్ తో దూరంగానే వున్నారు. ఇటీవలే వీరిమధ్య ఎటువంటి రాజకీయ సంభాషణలు జరిగిన సందర్భాలు లేవు. దీంతో వీరిమధ్య చెడిందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీకి పూర్తి మద్దతివ్వడంలో కీలకపాత్రను పోషించిన పవన్ కల్యాణ్ ను ఇప్పుడు మోడీ ఎందుకు దూరంగా వుంచుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మోడీ ప్రధాని అయిన అనంతరం కూడా పవన్ తో సన్నిహితంగానే వుంటూ వచ్చారు కానీ.. క్రమక్రమంగా వీరిమధ్య దూరం పెరిగిపోయింది. ఏవైనా కార్యక్రమాలను నిర్వహించిన సందర్భాల్లో మొదట టీడీపీ లేదా బీజేపీ నుంచి పవన్ కు పిలుపు వచ్చేది కానీ.. స్వచ్ఛ్ భారత్ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మోడీ ఎందుకు ఆహ్వానించలేదంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆయన ఛాలెంజ్ చేసిన వారి పేర్లలో పవన్ పేరు ఎందుకు లేదంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరి వీరిమధ్య దూరం పెరగడానికి గల కారణాలు ఏముంటాయోనని రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుపట్టడం లేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  pawan kalyan  swachch bharat  indian politics  

Other Articles