Pakisthan seize fire at indian border

india, pakitshan, india news, india border, india pakisthan border, india pakisthan war, india china war, india china war, latest news, pakisthan army, pakisthan news, pakisthan troops, pakisthan people, pakisthan culture, pakisthan tourism places, indian army, pakisthan army on india, indian army war, encounters, border, line of actual control

pakisthan army troops fired through out night at indian posts with mortar shells and guns : in border heavy fire exchange between India and pakisthan

భారత్-పాక్ సరిహద్దులో యుద్ధం ఆగలేదు

Posted: 10/08/2014 09:32 AM IST
Pakisthan seize fire at indian border

భారత్ - పాకిస్థాన్ మద్య వివాదాలు రావణకాష్టంలా రగులుతున్నాయి. దాయాది దేశం.., ఎంత చెప్పినా వినకుండా భారత్ పై కాల్పులకు తెగబడుతోంది. పోరాడేంత సత్తా లేకపోయినా.., తుపాకులు పట్టుకుని సరిహద్దుపై విరుచుకుపడుతోంది. రెండ్రోజుల క్రితమే సరిహద్దుపై దాడి చేసి ఐదుగురిని పొట్టనబెట్టుకోగా.., తాజాగా మంగళవారం రాత్రి నుంచి కాల్పులు జరుపుతోంది. చీకటి దాడులకు అలవాటు పడిన పాకిస్థాన్.., భారత సరిహద్దులోని 63పోస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. దీంతో సరిహద్దులో ఒక్కసారిగా యుద్ధవాతావరణం ఏర్పడింది.

కాశ్మీర్ లోని సాంబా, హీరానగర్, ఆర్ ఎస్ పురా, ఆర్నియా, ఫర్గ్ వాల్, కనాచక్ సెక్టార్లపై అయితే తుపాకులతో విరుచుకుపడింది. రాత్రి నుంచి ఉదయం వరకు ఏకధాటిగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. పాక్ కుట్రలపై భారత జవాన్లు అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. పాకిస్థాన్ కాల్పులకు ధీటుగా భారత సైన్యం సమాధానం చెప్తోంది. మన సైన్యం జరిపిన దాడిలో పాక్ కు చెందిన రెండు సైనిక స్థావరాలు ద్వంసం అయ్యాయి. తాజా కాల్పుల విషయాన్ని ఆర్మీ ఉన్నతాధికారులు దృవీకరించారు. పాక్ బలగాలు అర్ధరాత్రి తుపాకులు, మోర్టార్ షెల్స్ తో దాడులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఒక భారత జవాను సహా ఐదుగురు పౌరులు గాయపడ్డారని వెల్లడించారు.

ఆదివారం జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు బలయ్యారు. ఈ కాల్పులపై రక్షణ శాఖకు సమాచారం అందిస్తామని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. భారత్ - పాకిస్థాన్ మద్య కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ.., దాయాది సైన్యం ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటుంది. రాత్రి సమయంలో కాల్పులు జరిపి తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తుంటారు. అయితే వీరిని భారత బలగాలు సమర్ధంగా ఎదుర్కుంటున్నాయి. భారత్ తో శాంతి కోరుకుంటున్నట్లు చెప్పే పాక్ ప్రభుత్వం.., సరిహద్దులో పాక్ ఇంతగా తెగబడుతున్నా కనీసం దీనిపై ప్రకటన కూడా చేయదు. ఇలాంటి వారిని ఏమనాలో వారే చెప్తే బాగుంటుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakisthan  india  encounter  latest news  

Other Articles