Boys missed calls women regularly may cause danger

missed calls, boy missed call women, missed call case, bihar police, bihar government, women talking phone, gent talking girl

boys missed calls women regularly may cause danger : bihar police officials takes a serious action that if anyone do missed call regulary to girl or women then he will be jailed

అమ్మాయిలకు మిస్డ్ కాల్ ఇస్తే.. అంతే సంగతులు!

Posted: 09/24/2014 09:44 PM IST
Boys missed calls women regularly may cause danger

ఈమధ్యకాలంలో మన భారతదేశంలో మిస్డ్ కాల్ పర్వం బాగానే కొనసాగుతోంది. ముఖ్యంగా అబ్బాయిలైతే... ఏదో ఒక అమ్మాయి దొరక్కపోదా..? అంటూ తమకిష్టమొచ్చిన నెంబర్లు నొక్కేసి, మిస్డ్ కాల్స్ ఇస్తుంటారు. ఆ రాంగ్ నెంబర్ అబ్బాయికి తగిలితే పక్కనపెట్టేస్తారు కానీ.. అమ్మాయికి తగిలితే మాత్రం అంతే సంగతులు! మళ్లీ మళ్లీ చేస్తూ వారిని ఇబ్బందులు పెడుతుంటారు. ఉద్దేశపూర్వకంగానే పదే పదే మిస్డ్ కాల్స్ ఇస్తుంటారు. ఇటువంటి వేధింపులు రానురాను చాలా ఎక్కువ అయిపోయాయి. ముఖ్యంగా ఉత్తర బారతదేశంలోని బీహార్ లో అయితే ఇటువంటి వ్యవహారాలు కోకొల్లలు! దీంతో విసిగిపోయిన కొంతమంది మహిళలు పోలీసులను ఆశ్రయించగా.. వారు సరికొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చారు.

ఉద్దేశపూర్వకంగా మహిళలకు మిస్డ్ కాల్స్ ఇస్తే జైల్లో గడపాల్పి వుంటుందని ఆ రాష్ట్ర సీఐడీ ఇన్ స్పెక్టర్ జనరల్ అరవింద్ పాండే హెచ్చరించారు. ఐపీసీలోని 345-బి సెక్షన్ ప్రకారం.. తనకు అందిన మిస్డ్ కాల్ గురించి ఏ అమ్మాయి అయినా పోలీసులకు ఫిర్యాదు చేసిన పక్షంలో.. ఆ కాల్ వచ్చిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చునని ఆయన వెల్లడించారు. అయితే ఇందులో రెండు ముఖ్యమైన అంశాలను ఆయన పొందుపరిచారు. కాల్ చేసిన వ్యక్తి పురుషుడై వుండాలి... అలాగే దురుద్దేశంతోనే మిస్డ్ కాల్ ఇచ్చాడని తేలాలి. ఈ రెండు విషయాలు తేలితేనే సదరు వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ విషయం గురించి తమ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులందరికీ సర్క్యులర్ పంపామని ఆయన అన్నారు.

మహిళలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టే విషయంలో భాగంగా ఈ సరికొత్త విధానాన్ని అమలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే మహిళలపై నేరాలను అదుపు చేయడానికి సంబంధించిన చట్టాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా మహిళా పోలీసు బృందాలు చైతన్య శిబిరాలను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. కొంతమంది అమ్మాయిలు విద్యనభ్యసించడం కోసం లేదా ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తుంటారు. ఆ నేపథ్యంలోనే కుటుంబం నుంచి స్వేచ్ఛ లభించిందన్న అత్యుత్సాహంతో జాగ్రత్తలు తీసుకోరు. ఆ సమయంలో అనుకోకుండా తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడటంగానీ లేదా అనుకోని సంఘటనల్లో ఇరుక్కుపోవడం జరుగుతుంది. ఆ సందర్భంలోనే వారికి అనుకోకుండా ఎక్కువ మిస్డ్ కాల్స్ వస్తుంటాయి. వాటిని అరికట్టేందుకు, ఆకతాయిల దురాచారాలను ఆపేందుకే పోలీసు అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : missed calls  bihar police  girls harrassments  boys harrassements  

Other Articles