Power cuts starts again in ghmc

power, power cuts, starts, GHMC, greater Hyderabad, again, Telangana, Kcr

power cuts starts again in GHMC

‘గ్రేటర్’ను అలుముకోనున్న చీకట్లు..

Posted: 09/25/2014 08:43 AM IST
Power cuts starts again in ghmc

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్ ను సరఫరా చేసేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం వర్షాకాలంలోనూ విద్యత్ కోతలకు నడుంబిగించింది. ఎన్నికలకు ముందు విద్యత్ కష్టాలు వుండవని చెప్పిన కేసీఆర్.. అధికారలోకి రాగానే తానిచ్చిన మాటను మరిచినట్లు వున్నారు. మునుపెన్నడూ లేనట్టుగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టగానే.. ప్రజలకు కరెంటు కష్టాలు మొదలయ్యాయి. ఛత్తీస్ గడ్ రాష్ట్రం నుంచి విద్యత్ ను కోనుగోలు చేసైనా.. తెలంగాణలో విద్యుత్ ను సరఫరా చేస్తామన్న కేసీఆర్ ఎన్నికల ముందు మాటలు.. నీటి మూటలేనా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలోనూ విద్యుత్ వెలుగులు అంతరించిపోతున్నాయి.

ముఖ్యంగా మహానగరం గ్రేటర్ హైదరాబాద్ లో మళ్లీ తిమిరాలు అలుముకోనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు గంటల సేపు విద్యుత్ కోతలు విధించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ  అధికారికంగా ప్రకటించింది. గత నెలాఖరులో విస్తారంగా వర్షాలు కురవడంతో తాత్కాలికంగా కోతల నుంచి ఉపశమనం లభించినా..  వానాకాలం ముగుస్తుండటం.. క్రమంగా విద్యుత్తు డిమాండ్ పెరుగుతుండటంతో దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ కోతలను పునరుద్ధరించాలని నిర్ణయానికి వచ్చింది. రోజుకు నాలుగు గంటల విద్యత్ కోతలను రెండు విడతల్లో రెండు గంటల చోప్పున కోతను విధించాలని అధికారిక ఆదేశాలను జారీ చేసింది. గ్రేటర్‌లోని 210 సబ్‌స్టేషన్లను మూడు భాగాలుగా విభజించి కోతల సమయాలను అధికారులు ప్రకటించారు. విద్యుత్తు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సరఫరా పరిస్థితి నగరంలో మూడు నాలుగు రోజులుగా అస్తవ్యస్తంగా మారింది. రెండు రోజులుగా అరగంట నుంచి గంట వరకు కోతలు అమలు చేస్తున్న డిస్కం.. పరిస్థితి చేయిదాటకుండా నాలుగు గంటలకు పెంచేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో చీకట్లు అలుముకుంటున్నా.. శరవేగంగా అభివృద్ది జరుగుతుందంటూ అధికార పార్టీ నేతలు మైకుల ముందు ఊదరగొట్టడంపై విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలో అంధకారం అలుముకుంటే.. దాని పరిష్కార మార్గాల కోసం అన్వేషించకుండా.. ముఖ్యమంత్రి కేసీఆర్ అయన మంత్రివర్గ సహచరులు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టడం, విపక్షాలపై మండిపడడం ఎంతవరకు సమంజసమని తెలంగాణ వాసులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో నిత్యం విద్యుత్ కోతలు వుంటే పెట్టుబడిదారులు ఎలా వస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ అనుభవ రాహిత్యంతోనే రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని పీసీసీ ఛీప్ పొన్నాల విమర్శించారు. కాగా మహానగరం గ్రేటర్ పరిధిలో విద్యుత్ కోతలు, వాటి సమయాలను అధికారులు వెల్లడించారు.

ఉదయం 6-8గంటల వరకు, మధ్యాహ్నం 12-2 గంటల వరకు:
జేమ్స్‌స్ట్రీట్, క్లాక్‌టవర్, బన్సీలాల్‌పేట, కిమ్స్, మోండా మార్కెట్, పాటిగడ్డ, మారేడ్‌పల్లి, జింఖానా, అడ్డగుట్ట, నెహ్రూనగర్, సీతాఫల్‌మండి, చిలకలగూడ, లాలగూడ, ఐఐసిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ప్రాగా టూల్స్, హెచ్.ఏ.ఎల్., ప్రశాంతి నగర్, ఐడీపీఎల్, బోయిన్‌పల్లి, చిన్న తోకట్ట, గన్‌రాక్, భూదేవినగర్, రాష్ట్రపతి నిలయం, హకీంపేట, మచ్చ బొల్లారం, హెచ్.ఎం.టి., ఫీవర్ ఆసుపత్రి, విఠల్‌వాడి, అంబర్‌పేట, దుర్గానగర్, నారాయణగూడ, బతకమ్మకుంట, విజయ్‌నగర్‌కాలనీ, సూరారం, జీడిమెట్ల, ఎలీప్, సూరారం రాజీవ్‌గృహకల్ప, మయూరీనగర్, మదీనాగూడ, జీడిమెట్ల ఫేజ్ 1-4, హుడా ట్రక్కుపార్కు, వేమనకాలనీ, విజ్ఞాన్‌పురి, వినాయక్‌నగర్, మల్కాజ్‌గిరి, ఆనంద్‌భాగ్, సైనిక్‌పురి, కుషాయిగూడ, చర్లపల్లి, సాకేత్, యాప్రాల్, సీఆర్‌పీఎఫ్, కౌకూర్, నందనవనం, తుర్కంజాల్, చంపాపేట, లెనిన్‌నగర్, వనస్థలిపురం, మామిడిపల్లి సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నారు.

ఉదయం 8-10, మధ్యాహ్నం 2-4 గంటల వరకు:
ఎర్రమంజిల్, ఇందిరాపార్కు, జవహర్‌నగర్, హైదర్‌గూడ, లేక్‌వ్యూ, హుస్సేన్‌సాగర్, లుంబినీపార్కు, ఎగ్జిబిషన్, పబ్లిక్ గార్డెన్స్, నిజాం కళాశాల, నిమ్స్, బంజారాహిల్స్ రోడ్ నెంబరు: 2, 12, 22, ఎమ్మెల్యేకాలనీ, జూబ్లిహిల్స్, మాదాపూర్, కల్యాణినగర్, యూసుఫ్‌గూడ, ఎల్లారెడ్డిగూడ, అయ్యప్పసొసైటీ, శ్రీనగర్‌కాలనీ, ఫిలింనగర్, గుడిమల్కాపూర్, ఏసీగాడ్స్, ఆసిఫ్‌నగర్, గోల్కొండ, లంగర్‌హౌస్, టోలీచౌకీ, మోతీమహాల్, నాంపల్లి, సరోజినిదేవి ఆసుపత్రి, బాలాజీనగర్, కేపీహెచ్‌బీకాలనీ, చందానగర్, పాపిరెడ్డికాలనీ, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, కొత్తగూడ, జేఎన్టీయూ, మూసాపేట, ల్యాంకోహిల్స్, కొత్తపేట, మోహన్‌నగర్, మారుతీనగర్, బండ్లగూడ, ఆటోనగర్, హిమాయత్‌నగర్, రాజీవ్ స్వగృహ, తట్టి అన్నారం, పెద్దంబర్‌పేట, రామచంద్రాపురం, అబ్దుల్లాపూర్ మెట్, రామోజీ ఫిలింసిటీ, నాగోల్, ఫ్రూట్‌మార్కెట్, భగత్‌సింగ్‌నగర్ సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ కోతను విధించనున్నారు

ఉదయం 10-12, సాయంత్రం 4-6 గంటల వరకు:
ఈఎన్‌టీ ఆసుపత్రి, గోషామహల్, కార్వాన్, ఉస్మానియా ఆసుపత్రి, సీతారాంబాగ్, సుల్తాన్‌బజార్, కోఠి మహిళా కళాశాల, బరదారి, ఫలక్‌నుమా, కందికల్‌గేట్, ఖిల్వత్, మీరాలం, పెట్ల బుర్జ్, పాన్‌జేషా, సాలార్జంగ్, అత్తాపూర్, కంచన్‌బాగ్, మలక్‌పేట, మూసారంబాగ్, సంతోష్‌నగర్, ఏయిర్‌పోర్టు, ఆల్విన్, బేగంపేట, ఈఎస్ఐ, గ్రీన్‌ల్యాండ్స్, కుందన్‌బాగ్, మైత్రివనం, మోతీనగర్, సంజీవయ్యపార్కు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, హబ్సీగూడ స్ట్రీట్ నెంబరు: 8, ఉప్పల్ పారిశ్రామికవాడ, రామంతాపూర్, ఎన్‌జీఆర్ఐ, నాచారం, మల్లాపూర్, టెక్‌పార్కు, నోమా మల్లాపూర్, కొంపల్లి, సుభాష్‌నగర్, ఉషాముళ్లపుడి, జగద్గిరిగుట్ట, దూలపల్లి, పుప్పాల్‌గూడ, ఉప్పర్‌పల్లి, ఇబ్రహింబాగ్, కాటేదాన్, గగన్‌పహాడ్, గంధంగూడ ప్రాంతాల పరిధిలో విద్యుత్ కోతను విధించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : power  power cuts  starts  GHMC  greater Hyderabad  again  Telangana  Kcr  

Other Articles