Jayaprakash narayan resigns to loksatta

loksatta, jp, loksatta jp, jayaprakash narayan, attack on jp, jp resigns to loksatta, loksatta party, join in loksatta, jayaprakash narayana resigns to loksatta, political parties, ias, ips, public service, government, latest news, andharapradesh, telangana

jayaprakash narayan resigns to loksatta party national presedint post : loksatta will be without jayaprakash narayana as he resigns to party

లోక్ సత్తాకు జేపీ రాజీనామా..

Posted: 09/14/2014 07:39 PM IST
Jayaprakash narayan resigns to loksatta

తాను కట్టిన ఇంటి నుంచి తానే బయటకు వెళ్ళిపోయాడు. కలల సౌధాన్ని మరొకరికి అప్పగించాడు. సమాజంలో మార్పుకోసమని ఉద్యమించిన సంఘం... వ్యవస్థాపకుడిని దూరం చేసుకుంది. రాజకీయాలకు పట్టిన రోగాలను నయం చేసేందుకు వచ్చిన వైద్యుడు.., తాను స్థాపించిన ఆస్పత్రికి సెలవు చెప్పాడు.  లోక్ సత్తా పార్టికి జయప్రకాష్ నారాయణ రాజీనామా చేశారు. ప్రస్తుతం పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్న జేపీ ఆ పదవికి రాజీనామా చేసినట్లు ఆదివారం ప్రకటించారు. ఈ నిర్ణయంతో పార్టీ కార్యకర్తలు షాక్ అయ్యారు. లోక్ సత్తాను స్థాపించిన జేపీనే పార్టీకి రాజీనామా చేయటం ఏంటని ముందుగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అదే నిమజని తెలిసి విచారం వ్యక్తం చేశారు.


పార్టీకి బలమైన నాయకత్వాన్ని తీసుకువచ్చే ఉద్దేశ్యంతో రాజీనామా చేసిినట్లు జేపీ ప్రకటించారు. పార్టీకి దూరంగా ఉన్నప్పటికి.. సలహాలు, సూచనలు ఇస్తానని చెప్పారు. అటు క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలగటం లేదన్నారు. అయితే జేపీ రాజీనామా కారణాలు వేరే ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓడిపోవటంతో అందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లు వారు చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని జేపి సన్నిహితులు తోసిపుచ్చుతున్నారు. దాదాపు ఇరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కేవలం ఈ ఓటమికి బాధ్యుడిగా బాదపడే వ్యక్తి కాదని అంటున్నారు.

రాజకీయ వైద్యుడు

మహారాష్ర్టలోని ఓ తెలుగు మాట్లాడే కుటంబంలో పుట్టిన నాగభైరవ జయప్రకాష్ నారాయణ్ (జేపీ) డాక్టర్ చదివారు. ఆ తర్వాత సివిల్స్ రాసి ఐ.ఏ.ఎస్.కు ఎంపికయ్యారు. మొట్ట మొదటగా 1980లో గుంటూరులో ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు. అనంతరం ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలకు కలెక్టర్ గా బాద్యతలు నిర్వర్తించారు. వీటితో పాటు గవర్నర్ కార్యదర్శిగా.., ముఖ్యమంత్రి కార్యదర్శిగా కూడా కీలక పదవులు నిర్వర్తించారు. ఏ పదవిని చేపట్టినా.., నిక్కచ్చిగా, నిజాయితీగా చేయటం జేపీకి అలవాటు. అలాంటి ప్రత్యేక గుణమే.., అధికారాన్ని ఇవ్వకున్నా ప్రజల్లో ఆయనకో గుర్తింపు తెచ్చింది. జేపి అంటే అందరూ రాజకీయ నేతల్లా కాదు.., మాట తప్పడు, తప్పటడుగు వేయడు అనే పేరును తీసుకువచ్చింది.

సమాజమే జేపీ జీవితం

ఐఏఎస్ అధికారిగా ఉన్నపుడే ఇంకా ప్రజలకు ఏదో చేయాలనే తపన కలిగి ఉన్న జేపీ 1996లో లోక్ సత్తా అనే స్వచ్చంధ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వ పధకాలపై అవగాహన, ఓటు హక్కు ప్రాముఖ్యతతో పాటు, అవినీతి నిర్మూలన, లంచానికి వ్యతిరేకంగా పోరాటం వంటి ఉద్యమాలను రూపొందించాడు. అధికారిగా ప్రజలకు పూర్తిస్థాయి సేవ చేయలేననే విషయం తెలుసుకుని ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి మొదలైంది జేపీ ప్రత్యక్ష్క్ష ప్రజా జీవిత ప్రస్థానం. సమాజమే ఇళ్లుగా, ప్రజా సంక్షేమమే జీవితంగా పోరాడాడు. అనేక ఉద్యమాలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుుకువచ్చాడు. లోక్ సత్తా  ద్వారా సమాచార హక్కు, సహకార సంఘాలకు స్వయం ప్రతిపత్తి, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిసన్, పార్టీ ఫిరాయింపుల చట్టం బలోపేతం, పార్టీ నిధుల సమీకరణ చట్టం ఇలా అనేక చట్టాలు అమలు కావటంలో కీలక పాత్ర పోషించాడు.

స్వచ్చంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించిన జేపీ., మరింత సేవ చేయాలనే ఉద్దేశ్యంతో లోక్ సత్తా పేరుతో రాజకీయ పార్టీని స్థాపించాడు. పార్టీ ద్వారా కూడా అనేక పోరాటాలు చేశారు. ఓట్లు, పదవులు, అధికారమే లక్ష్యంగా నేతలు పుట్టుకొస్తున్న ప్రస్తుత రాజకీయాల్లో ప్రజాకాంక్ష అనే సామాజిక స్వార్ధంతో పార్టిని స్థాపించి నడిపించాడు. అయితే ప్రజల్లో జేపికి మంచి పేరు ఉన్నా.., అది అధికారం మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది. కుల, మత, వర్గ, ప్రాంతీయ రాజకీయాలు రాజ్యమేలుతున్న ఈ తరుణంలో జేపీ లోక్ సత్తా అంత సత్తా చాటలేకపోయింది. అయినా సరే అధైర్యపడలేదు. పార్టీని ముందుకు నడిపించారు. అనేక మంది విద్యావంతులు, మేధావులు జేపీని వెనకుండి నడిపించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.

అతడే ఒక సైన్యం

సభకు కొత్త సభ్యుడే అయినా.., ప్రజలు, ప్రజా సమస్యలకు మాత్రం పరిచయం ఉన్న వ్యక్తి. దీంతో ప్రతి ప్రజా సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించాడు. నేతలంతా పార్టీలు, ప్రాంతాలుగా విడిపోయి రాజకీయాలు మాట్లాడుతుంటే వారందరికి ధీటుుగా ప్రజల గురించి మాట్లాడి నిజమైన శాసనసభ్యుడు అనిపించుకున్నాడు. జేపి మాట్లాడుతున్నాడంటే జాగ్రత్తగా ఉండాలి అనుకునే నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ తరపున సభలో ఉన్నది ఒకడే అయినా అధైర్యపడలేదు. సముద్రం నీటి చుక్క నుంచే మొదలవుతుంది అన్న విశ్వాసంతో జేపీ సభలో ప్రసంగించేవారు.


రాష్ర్ట రాజకీయాలతో పాటు, దేశాన్నే కుదిపేసిన తెలంగాణ అంశం సెగ లోక్ సత్తా పార్టికి కూడా తగలిందని చెప్పవచ్చు. విభజన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డ సమయంలో.., ఎందరో విద్యార్థులు నేలకు రాలుతుండటం చూసి ఆవేదన చెందారు. దీనికి కేంద్రం సమాధానం చెప్పాలని నిలదీశారు. అయితే మిగతా పార్టీలు ఎవరికి వారు, ప్రాంతాలవారిగా పార్టీల వారిగా  విడిపోయి మాట్లాడటంతో మౌనంగా బాదపడ్డారు. అన్ని పార్టీల్లాగానే లోక్ సత్తా కూడా తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలని ఉద్యమ సంఘాలు డిమాండ్ చేయగా.., తెలంగాణ ఇవ్వండి కానీ.., సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించండి అని స్పష్టం చేశాడు. ఉద్యమం సమయంలో జేపీ ఉద్యమకారుల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఈ క్రమంలోనే ఓ దురదృష్టకర ఘటన అసెంబ్లీ ఆవరణలో చోటుచేసుకుని చరిత్రలో చీకటి దినంగా మిగిలిపోయింది.

ఉద్యమకారులు తనను అవమానించినా.., ఉద్యమాన్ని గౌరవించిన నారాయణ్ తెలంగాణ బిల్లు రూపకల్పనలో అప్పటి యూపీఏ ప్రభుత్వానికి అనేక సలహాలు ఇచ్చారు. జేపీ ఎంతో విలువైన సలహాలు ఇచ్చారని.. ఆయన సూచనలు బిల్లు రూపకల్పనలో ఎంతో ఉపయోగపడ్డాయని తెలంగాణ బిల్లు రూపొందించిన జీఓఎం సభ్యులంతా ముక్తకంఠంతో శబాష్ జేపీ సార్ అని ప్రశంసించారు. రాజకీయాలు, ప్రజాక్షేమంపై ఆయనకున్న  దృష్టి, ఆలోచన ఇది చూస్తే అర్దం అవుతుంది. అన్ని పార్టీలలాగానే లోక్ సత్తాను కూడా రెండుగా విభజించి ఏపీ తెలంగాణ శాఖలను ఏర్పాటు చేశారు. ఇక పార్టీలో అధ్యక్షులు తమకు తామే నామినేట్ అయ్యేలా చేసుకుని పార్టీ అద్యక్ష ఎన్నికలంటూ ప్రహసనం చేస్తున్న తరుణంలో, తాను పక్కకు జరిగి స్వయంగా మరొక నేత తరపున ప్రచారం చేసి సారద్య బాధ్యతలు అప్పగించి నిజమైన రాజకీయం అంటే ఏమిటో చూపించిన వ్యక్తి.

ఇలా మూడున్నర దశాబ్దాల ప్రజా జీవితంలో ఎన్నో ఘటనలు, మరెన్నో అనుకోని పరిణామాలు, ఆనందాలు, సంతోషాలు,  బాధలు అన్ని ప్రజలతోనే వారి సంతోషమే తనకు పండగ.., ప్రజలకు వచ్చిన కష్టమే తనకున్న సమస్యగా ప్రజల కోసం పోరాడిన ప్రజల మనిషి జయప్రకాష్ నారాయణ. దేశానికి ఐఏఎస్ గా ఆయన సేవలు అవసరం లేవని నాటి నేతలు భావించవచ్చు. కానీ రాజకీయవేత్తగా.., సామాజిక శ్రేయోభిలాషిగా ఆయన ప్రజా జీవితంలో క్రియాశీలకంగా ఉండటం అనివార్యం. ఇది సామాన్యుడి గుండె గొంతుక ఏకమై చెప్తున్న మాట.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayaprakash narayan  loksatta  jp  latest news  

Other Articles