Oil tankers goes on strike at dock yard

oil tankers, strike, Visakhapatnam, police, no entry, new timings

oil tankers goes on strike.. agitation against police no entry timings

పోలీసులతో అమీతూమీకి రె‘ఢీ’

Posted: 09/12/2014 09:04 AM IST
Oil tankers goes on strike at dock yard

పోలీసులతో అమీతూమికి అయిల్ ట్యాంకర్ యజమానులు సిద్దమవుతున్నారు. తమ అధాయానికి పోలీసులు తాజా నిర్ణయాలు గండి కోడుతున్నాయని భావించిన ఆయిల్ ట్యాంకర్ల యజమానులు పోలీసుల తీరుకు నిరసనగా పోరాటానికి సిద్దమయ్యారు. విశాఖపట్నంలోని మూడు చమురు సంస్థలకు చెందిన ట్యాంకర్ల యజమానులు ఇవాళ్టి నుంచి రవాణాను నిలిపివేయనున్నారు. నగరంలోని హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీల చమురు టెర్మినళ్ల నుంచి నిత్యం 700 ట్యాంకర్ల ద్వారా చమురు ఇతర ప్రాంతాలకు రవాణా జరుపుతున్న వీరికి ట్రాఫిక్ నియంత్రణ అడ్డుపడింది. విశాఖలో వాహనాల రద్దీ దృష్ట్యా తాజాగా, పోలీసులు నగరంలో లారీలకు నోఎంట్రీ సమయాలను విడుదల చేశారు.
అయినా అయిల్ ట్యాంకర్ యజమానులకు యధేశ్చగా ట్యాంకర్లను నడిపిస్తుండడంతో.. అగ్రహించిన పోలీసులు వారిపై చర్యలకు పూనుకున్నారు. డాక్‌యార్డు పరిసరాల్లో ట్యాంకర్లను అడ్డుకున్న పోలీసులు వాటిని విశాఖ నగరంలోకి రానీయకుండా నిలిపేశారు. దీంతో నిర్ణీత సమాయానికి గమ్యస్థానాలకు ఇంధనాన్ని సరఫరా చేయలేకపోతున్నామని ట్యాంకర్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం జరిగిన పోలీసు చర్యలకు నిరసనగా శుక్రవారం నుంచి లోడింగ్‌కు ట్యాంకర్లను పంపకూడదని నిర్ణయించామని సంఘం ప్రతినిధి పడాల వరప్రసాద్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : oil tankers  strike  police  no entry  

Other Articles