Jc prabhakar reddy says no use with anna canteens

amma canteens, anna canteens, tamilnadu, jayalalitha, subsidy, government benefits, jc prabhakar reddy, jc divakar reddy, tdp, telugu desham party, andhrapradesh news, latest news, chandrababu naidu, mid day meal, government schools, education

no use with anna canteens in andhrapradesh says jc prabhakar reddy : taadipatri mla prabhakar reddy says babu decission to start anna canteens is waste because government not running mid day meal successfully

చంద్రబాబును తప్పుబట్టిన టీడీపీ ఎమ్మెల్యే

Posted: 09/12/2014 07:55 AM IST
Jc prabhakar reddy says no use with anna canteens

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ వైపు అక్టోబర్ 2నుంచి అన్న క్యాంటిన్లు నిర్వహించేందుకు స్థలం వెతుకుతుంటే.., మరోవైపు నేతలు అప్పడే అడ్డుపుల్లలు వేయటం మొదలుపెట్టారు. పధకం ప్రారంభమే కాలేదు.., అప్పుడే ఇది అవసరమా.., దండగ కదా అని డిక్లేర్ చేస్తున్నారు. పోని అది విపక్షాలు లేదా ఉద్యమ, ప్రజా సంఘాల నేతలు అంటే సరే అనుకోవచ్చు కానీ... అధికార పక్ష ఎమ్మెల్యేలే ప్రభుత్వ పధకాన్ని తప్పుబడుతున్నారు. ఆంధ్రలో అన్న అన్నం అవసరం లేదంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ మాట అన్నారు.

 

ఏపీలో వచ్చే నెలలో ప్రారంభం అయ్యే ‘అన్న క్యాంటిన్ల’పై స్పందించిన ప్రభాకర్ రెడ్డి.., కొన్ని పధకాలను ప్రభుత్వం ఎందుకు తీసుకువస్తుందో అర్ధం కావటం లేదన్నారు. అందులో అన్న క్యాంటిన్లు ఒకటని చెప్పారు. తమిళనాడులో జయసర్కారు నిర్వహిస్తున్న అమ్మ క్యాంటీన్ల మాదిరిగా ఇక్కడ నడుపుతామంటే కుదరదన్నారు. తమిళ తంబీలు సాంబారు, అన్నంతో కడుపునింపుకుంటారని.., అయితే ఆంధ్రలో ఆ పద్దతి ఉండదని చెప్పారు. కూరలు, ఊరగాయలు ఎలా పెడతారని ప్రశ్నించారు. అయితే హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో ఇస్కాన్ వంటి సంస్థలు ఐదు రూపాయలకే కూర, సాంబారు, పచ్చడతో అన్నం పెడుతున్నాయని విలేకర్లు ప్రశ్నంచగా దానికీ జేసీ సమాధానం చెప్పారు.

 

ఇస్కాన్ భోజనం ఆదర్శంగా తీసుకుంటే వారి పప్పులో కాలేసినట్లే అని చెప్పారు. అంతేకాదు ఇస్కాన్ భోజనంలోనే చాలా లోపాలున్నాయని చెప్పారు. అయితే అదేమిటో ఎమ్మెల్యే వివరించలేదు. అంతేకాకుండా భోజనం పెట్టాలంటే తమను చూసి నేర్చుకోవాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఇక చివరగా స్కూళ్ళలో మధ్యాహ్నభోజనమే సరిగా అందిచలేనపుడు అన్న క్యాంటిన్ల ద్వారా ఎలా నాణ్యమైన ఆహారం అందిస్తారని ప్రశ్నించారు. ఏడేళ్ళుగా తాడిపత్రిలో తాము మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని.., ఎలా కార్యక్రమం నిర్వహిస్తున్నాము, భోజనం నాణ్యతను తాడిపత్రికి వచ్చి చూసి తెలుసుకోండి అని హితవు పలికారు.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anna canteens  jc prabhakar reddy  chandrababu naidu  latest news  

Other Articles