Tdp leader kavitha comments against chandrababu

actress kavitha, actress kavitha daughter marriage, kavitha on chandrababu naidu, tdp leader kavitha, telugu heroines, actress hot, tollywood, andhrapradesh, elections, latest news, chandrababu naidu

actress and tdp women wing leader kavitha hurts by chandrbabu way on her : kavitha says babu promised her to ticket in 20019, 2014 elections but not did so

బాబు అన్యాయం చేశారని కవిత ఆవేదన

Posted: 09/10/2014 12:00 AM IST
Tdp leader kavitha comments against chandrababu

రాజకీయ చాణిక్యుడు చంద్రబాబు వ్యవహారంపై నటి, పార్టీ మహిళా నేత కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటిపై చంద్రబాబు తనకు అన్యాయం చేశారని ఆరోపించారు. 2009, 2014 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తానని.., పోటి చేసే స్థానం కూడా ఎంపిక చేసినట్లు చెప్పిన చంద్రబాబు చివరలో మొండిచెయ్యి చూపారని ఆరోపించింది. పార్టీ అధినేత వైఖరి తనను ఎంతగానో బాధించిందని తూర్పుగోదావరి జిల్లాలో తన అక్కసు వెల్లగక్కింది. తనకు టికెట్ ఇవ్వకపోయినా ప్రచారంలో పాల్గొని పార్టీ విజయం కోసం పని చేశానని చెప్పారు. ఇంత చేసిన తనకు ఇప్పటికీ అన్యాయమే జరుగుతుందన్నారు.

గతంలో పార్టీ మహిళా విభాగంలో రాష్ర్ట ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసిన తనకు పార్టీలో ఏ స్థానం లేదన్నారు. ఇది తనను మరింత బాధిస్తుందన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ తనకు ఏమి మిగిలిందని చూసుకుంటే బాధకలుగుతోందన్నారు. అయినా సరే దివంగత నేత ఎన్టీఆర్ పై ఉన్న గౌరవం, పార్టీ విధానాల పట్ల ఉన్న మక్కువతోనే టీడీపీలో కొనసాగుతన్నట్లు చెప్పారు. భవిష్యత్తులో అయినా తనకు తగిన హోదా వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ అదే జరగకపోతే చంద్రబాబునే కలిసి తాడోపేడో తేల్చుకుంటానని కవిత చెప్పారు.

తూర్పుగోదావరి జిల్లా మురమళ్లలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కార్యక్రమం తర్వాత మీడియాతో మాట్లాడిన కవిత తనకు పోటి చేసే అవకాశం ఉందని చెప్పి చివర్లో టికెట్ ఇవ్వకపోవటంపై కలత చెందానని చెప్పింది. అదేవిధంగా రాష్ర్టం విడిపోవటం బాధకారమన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా రాష్ర్టాన్ని విభజించిన కాంగ్రెస్ కు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని కవిత అన్నారు. విభజన తర్వాత ప్రశ్నార్ధకంగా మారిన ఏపీ భవిష్యత్తును టీడీపీ ప్రభుత్వం తీర్చిదిద్దుతుందన్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress kavitha  chandrababu naidu  elections  latest news  

Other Articles