Will ysr congress rise in telangana

ysr congress, chanrababu naidu, kcr, ys jagan, jaganmohan reddy, ysr congress telangana, andhrapradesh, political parties, latest news, trs, tdp, bjp

ysrcongress reportedly announced new committee for telangana state : in telangana political leaders discusses about ysrcongress future after news that repotedly party announced new committee for state

తెలంగాణలో ఫ్యాను తిరుగుతుందా?

Posted: 09/10/2014 12:00 AM IST
Will ysr congress rise in telangana

తెలంగాణ ఏర్పాటును బహిరంగంగానే తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్. తెలంగాణ ఉద్యమం చివరి సమయంలో సమైక్యవాదాన్ని పట్టుకుని ప్రజల్లోకి వెళ్ళింది. సమైక్య పార్టీగా ముద్రపడి ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. అయితే కరడుగట్టిన సమైక్య పార్టీ అయిన వైసీపికి తెలంగాణలోనూ మూడు స్థానాలు వచ్చాయి. ఇది ఉద్యమాల గడ్డలో కూడా వారి గాలి కాస్తయినా వీస్తుందని చెప్పే అంశం. అయితే కారు స్పీడుకు అన్ని పార్టీలు కుదేలయిన రాష్ర్టంలో సమైక్యపార్టీ స్వరం విన్పిస్తుందా అనే ఊహాగానాలు వచ్చాయి. తెలంగాణలో దుకాణం బంద్ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలను తోసిపుచ్చుతూ కొత్త రాష్ర్టంలో జగన్ కొత్త కమిటీని ప్రకటించారు. మరి ఈ కమిటీ ఏ మేరకు పనిచేస్తుంది. పార్టీ ఎంతవరకు ముందుకెళ్తుంది?.

తొలి తెలంగాణ ఎన్నికల్లో కారు దూసుకెళ్లగా మిగతా పార్టీలు వెనకబడ్డాయి. అయితే ఆశ్చర్యకరంగా సమైక్య పార్టీ అని స్పష్టంగా ప్రకటించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ కు మూడు స్థానాలు వచ్చాయి. దీంతో తెలంగాణలో కూడా సమైక్యవాదులు ఉన్నారని కొందరు చెప్తుంటే.., లేదు అది వైఎస్, జగన్ పై ఉన్న అభిమానం శాతం మాత్రమే అని మరికొందరు అంటున్నారు. ఎన్నికల తర్వాత అన్ని పార్టీల మాదిరిగానే వైసీపీ నుంచి కూడా అధికార పక్షంలోకి వలస పక్షులు వెళ్ళాయి. ఇక్కడి నుంచి కాస్త ఎక్కువ మందే వెళ్లారనుకోండి. ఈ పరిణామాలపై అప్రమత్తమైన అధినేత వెంటనే పార్టీని చక్కదిద్దే పనులు చేపట్టారు. కొన్నాళ్లుగా అంతగా పట్టించుకోని తెలంగాన విభాగాన్ని తిరిగి బూజు దులిపి కొత్త శాఖ, నేతలకు కొత్త బాధ్యతలు అప్పగించారు. గతంలో ఏం జరిగినా ప్రస్తుతం రెండు రాష్ర్టాల్లో పార్టీని కొనసాగించాలని జగన్ అనుకుంటున్నారు.

11మంది నేతలతో తెలంగాణకు జగన్ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. వారిలో ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎడమ క్రిష్ణా రెడ్డి, నల్లా సూర్యప్రకాష్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, గట్టు రామచంద్రారావు, గట్టు శ్రీకాంత్ రెడ్డి, అబ్దుల్ రహ్మాన్, శివకుమార్, జనక్ ప్రసాద్, కొండా రాఘవ రెడ్డి లకు కొత్తగా సారధ్య బాధ్యతలు అప్పగించారు. వీరిలో కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు కొందరు నేతలు అన్ని సర్దుకోగా., ఆపేసి అండగా ఉంటానని హామి ఇచ్చి సారధ్య బాద్యతలు అప్పగించారు. కొత్త కమిటీ ప్రకటన, నేతలకు బాధ్యతల అప్పగింత.., ఇంతవరకు బాగానే ఉంది. కాని అధికారంలో లేకుండా ఎన్నాళ్లు ఈ కమిటి కొనసాగుతుందని అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి.

పార్టీ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ అధికారం రుచి చూడలేదు. నాలుగేళ్లు పోరాటమూ.., డబ్బులు ఖర్చు చేయటమే తప్ప ఆదాయం, అధికారం అనే మాటే లేదు. తిరిగి మరో ఐదేళ్ల పాటు ఉద్యమాలు, పోరాటాలు చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత కూడా అధికారంలోకి వస్తారన్న ఆశ మాత్రం లేదు. మహా అయితే కొన్ని స్థానాలు పెరగవచ్చు అంతే. సో ఇంత కష్టపడి చేస్తే తమకు ఏం వస్తుంది.., అని నేతలిప్పుడు ప్రశ్నించుకోవటం మొదలు పెట్టారు. బ్రతుకంతా పోరాటమేనా అని తమను తాము అద్దంలో చూసుకుంటున్నారు. పోని ప్రభుత్వంపై, ప్రజా సమస్యలపై చేసే పోరాటానికి ప్రజల మద్దతు ఉంటుందా అంటే సమైక్య ముద్ర చెరిగిపోకుండా ఉండటంతో పట్టించుకునేవారుండరు. ఈ పరిస్థితుల్లో పార్టీ మనుగడ ఎలా కొనసాగుతుందని ప్రశ్నలు వస్తున్నాయి.

నేతలకు పార్టీ నాయకత్వం ఆర్ధిక సాయం చేయవచ్చు. అయితే ప్రతి విషయానికి వారు నాయకత్వాన్ని అడగలేరు. అలా అని సొంతంగా ఖర్చు పెట్టే సాహసం చేయలేరు. వైసీపీకి విరాళాలు అనే విషయం తెలంగాణలో మర్చిపోక తప్పదు. ఇలాంటి పరిణామాల మద్య పాత సీసాలో నింపిన కొత్త సారా ఎంతమేరకు పనిచేస్తుంది. పార్టీ పరిణామాలు, రాష్ర్ట రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న విశ్లేషకులు తెలంగాణలో ఫ్యాను గాలి వీయటం కష్టమంటున్నారు. ఎన్ని రిపేర్లు చేసుకుని, కొత్త రంగు వేసుకుని వచ్చినా ఆ గాలి వాసన తెలిసిన పది జిల్లాల ప్రజలు ఫ్యానను పక్కన బెట్టడం ఖాయమంటున్నారు. చూడాలి మరి ఈ కొత్త కమిటీ ఏ చేస్తుందో.., ఎలా ముందుకెళ్తుందో.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysr congress  telangana  ys jagan  latest news  

Other Articles