Narendra modi sarkar tie up with flipkart company

narendra modi, narendra modi latest news, narendra modi filpkart website, narendra modi sarkar, bjp party ministers, flipkart, flipkart latest news, flipkart agreement narendra modi sarkar, narendra modi sarkar agreement flipkart, handloom weavers, handloom weavers things

narendra modi sarkar tie up with flipkart company : The indian pm narendra modi government has tie up with flipkart company. In this agreement flipkart will sale the handloom weavers things

ఫ్లిప్ కార్ట్ తో వ్యాపారాలు మొదలుపెట్టిన మోడీ!

Posted: 08/26/2014 10:22 AM IST
Narendra modi sarkar tie up with flipkart company

ప్రధాని పగ్గాలు చేపట్టినప్పటీ నుంచి నరేంద్రమోడీ వినూత్నమైన నిర్ణయాలు తీసుకుంటూ.. సరికొత్త సంచలనాలకు నాంది పలుకుతున్నారు. ధరల పెరుగుదల విషయం ఎలా వున్నా... అది కేవలం అభివృద్ధిలో భాగంగా పెంచాల్సి వచ్చిందని మోడీ సర్కారు చెప్పుకోవడంతో ప్రజలు కూడా సరైన నిర్ణయమేనంటూ సైలెంట్ అయిపోయారు. ఇలా దేశాభివృద్ధికోసం ఆయన ఎన్నోరకాలుగా పావులు కదుపుతున్నారు. నిన్నటికి నిన్నే బ్యాంకు ఖాతాలు వుంటే సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల వద్దకే చేరుతాయన్న నిర్ణయంతో ఆయన ‘‘జన్ ధన్ యోజన’’ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు తాజాగా ఆయన సర్కారు ఫ్లిప్ కార్టుతో కలిసి వ్యాపారాలు మొదలుపెట్టేసింది.

చేనేత కార్మికుల ఉత్పత్తుల విక్రయానికి సంబంధించి మోడీ సర్కారు దేశీయ ఈ-రిటెయిల్ దిగ్గజం ‘‘ఫ్లిప్ కార్ట్’’తో జతకట్టింది. ఈ ఒప్పందంలో భాగంగా దేశవ్యాప్తంగా వున్న చేనేత కార్మికులు తయారుచేసే ఉత్పత్తులన్నింటినీ ఫ్లిప్ కార్ట్ అమ్మిపెడుతుంది. తద్వారా చేనేత కార్మికుల విక్రయంలో మధ్యవర్తుల వ్యవస్థను రూపుమాపేందుకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఈ విధంగా ఒప్పందం కుదిర్చింది. చేనేత కార్మికులకు మంచి ధర, ఆదాయం లభించేలా చేయడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని జౌళి శాఖ కార్యదర్శి ఎస్.కే.పండా తెలిపారు. అంటే... ఇకనుంచి కార్మికులు ఇంట్లో కూర్చోనే మంచి లాభాలను ఆర్జించుకోవచ్చన్నమాట!

అయితే.. ఫ్లిప్ కార్ట్ కేవలం ఈ ఒక్క విషయంలో మాత్రమే ఒప్పందం చేసుకోవడంలో ఆంతర్యమేమిటని జౌళిశాఖ మంత్రిని ప్రశ్నించగా.. అందుకు స్పందించిన ఆయన ‘‘పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నందునే ఫ్లిప్ కార్ట్ ఒక్కదానినే ఎంచుకున్నాం’’ అని ఆయన స్పష్టం చేశారు. మరో ఆరునెలల్లో టెండర్లను ఆహ్వానించి.. ఈ ఒప్పందం మీద మరిన్ని విషయాల గురించి చర్చలు జరిపిన అనంతరం పని మొదలుపెడతామని ఆయన వెల్లడించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  handloom weavers  flipkart  bjp party ministers  

Other Articles