Hyderabad ranked last among 7 cities in real estate segment

hyderabad city, global real estate consultant Cushman & Wakefield survey, global real estate consultant Cushman & Wakefield news, indian famous cities

Hyderabad ranked last among 7 cities In real estate segment which is revealed the reported by global real estate consultant Cushman & Wakefield

బయటపడ్డ హైదరాబాద్ ‘‘రియాలిటీ’’.. కూపీలాగిన గ్లోబల్ సంస్థ!

Posted: 08/26/2014 11:23 AM IST
Hyderabad ranked last among 7 cities in real estate segment

రాష్ట్ర విభజన కాకముందు హైదరాబాద్ నగరంలో ఎన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయో మనందరికీ తెలిసిందే! ముఖ్యంగా రాజకీయ నాయకుల అక్రమదంధాలు కోకొల్లలు! మరోవైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం... తెలంగాణ మంత్రులతోపాటు ప్రజలు సీమాంధ్రతో నిత్యం గొడవలు! ఈ గొడవల మధ్య ఎవరూ హైదరాబాద్ నగరాన్నిగానీ.. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి అంశాలవైపుగానీ కనీసం ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఇక రాజకీయ నాయకులు అయితే ఇదే మంచి అవకాశమని భావించి దొరికిందంతా దోచేశారు. ఒకవైపు ప్రత్యేకరాష్ట్రం కోసం తన్నుకుంటుంటే.. మరోవైపు దోచుకోవాల్సిందంతా దోచుకుని సైలెంట్ అయిపోయారు. దీంతో అవినీతి ఎక్కువ పెరిగిపోవడంతోపాటు హైదరాబాద్ నగరాభివృద్ధి మరింత దారుణంగా దిగజారిపోయింది. ఎంతలా అంటే.. గ్లోబల్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. మన భారతదేశంలో వున్న అగ్రరాజ్యాలతో చిట్టచివరి స్థానాన్ని దక్కించుకుంది.

కష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ (Cushman and Wakefiled) అనే ఒక గ్లోబల్ కన్సల్టెంట్ సంస్థ తాజాగా మన భారతదేశంలో వున్న అగ్రరాజధానులలో మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యవహారాల మీద ఒక సర్వేను నిర్వహించింది. ఇందులో భాగంగా ముంబై, ఢిల్లీ, కోల్ కతా, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల వివరాల గురించి ఈ సర్వేను నిర్వహించగా.. అందులో హైదరాబాద్ చిట్టచివరి స్థానాన్ని సంపాదించుకుంది. గత మూడుసంవత్సరాల నుంచి మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విభాగంలో చాలా దారుణంగా పడిపోయిందని ఆ గ్లోబల్ సంస్థ సర్వే నిమిత్తం వివరించింది. అలాగే రాజధాని విలువ పెరుగుదల అంశంలోనూ హైదరాబాద్ పూర్తిగా వెనుకబడిపోయిందని ఆ సర్వేలో బహిర్గతమైంది.

హైదరాబాద్ ఇంతటి ఘోర పరిస్థితికి దిగజారడానికి ముఖ్య కారణం ఏమిటంటే.. రాష్ట్ర విభజన జరగకముందు గత కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయ నాయకుల మధ్య వాగ్యుద్ధాలు జరిగాయే కానీ.. నగరాభివృద్ధికోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. కేంద్రప్రభుత్వం కూడా ఇందులో జోక్యం చేసుకోకపోవడంతో హైదరాబాద్ చతికిలపడిపోయింది. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలలో అంటే.. హిమాయత్ నగర్, వెస్ట్ - ఈస్ట్ మారెడ్ పల్లి, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలలో 2011 సంవత్సరం లెక్కప్రకారం రియల్ ఎస్టేట్ విభాగంలో 23% వరకు లావాదేవీలు జరిగినట్టు తెలుపుతోంది. అలాగే మధాపూర్ - గచ్చిబౌలీ, మియాపూర్ - నిజాంపేట్ వంటి ఆరోగ్యకరమైన ప్రాంతాలుగా పరిగణించబడుతున్నప్పటికీ అక్కడ కూడా కేవలం 31% శాతం వరకు రియల్ ఎస్టేట్ బూమ్ జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా ఐటీ, ఫార్మా వంటి డెవలప్ మెంట్ కంపెనీలు వుండటం వల్లే రాజధాని విలువ పెరిగిందని.. ఇతర ప్రాంతాల్లో దీని విలువ అంతగా లేదని అవి తేల్చి చెబుతున్నాయి.

రియల్టర్ల లెక్కల ప్రకారం.. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు గత కొన్ని సంవత్సరాల నుంచి రాష్ట్ర విభజన సమస్య వల్ల పూర్తిగా అణిచివేయబడటం ఇతర నగరాలతో చాలా వెనుకబడిపోయిందని తేల్చి చెబుతున్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రాల విభజన అనంతరం ఇది తిరిగి ఐదారు నెల్లోనే కోలుకొని రియల్ ఎస్టేట్ విభాగంలో మంచి వ్యాపారాలను రాణించడంతోపాటు హైదరాబాద్ రాజధాని విలువను పెంచుతుందని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles