Dharma sansad finally released a conclusion that shiridi sai baba not god

shirdi sai baba, shirdi sai babi sansthan, dharma sansad, shirdi sai baba latest news, shirdi sai babu dharma sansad, dwaraka shankaracharya swaroopananda, kashi vidwat parishad

dharma sansad finally released a conclusion that shiridi sai baba not god : After meeting for two day.. the dharma sansad finally concluded that shirdi sai baba is not god

షిరిడీ సాయిబాబా దేవుడు కాదు... ఆయన్ని ఆరాధించకండి!

Posted: 08/26/2014 10:14 AM IST
Dharma sansad finally released a conclusion that shiridi sai baba not god

షిరిడీ సాయిబాబా మహిమ గురించి తెలియనివాళ్లు ఈ ప్రపంచంలో ఎవరైనా వున్నారా..? ‘‘సబ్ కా మాలిక్ ఏక్ హై’’ అంటూ ప్రజలమధ్య వున్న మతబేధాలను తొలగించి అందరినీ ఒక దైవంవైపు అడుగులు వేయించిన సాయిబాబా... తన చమత్కారంతో ఏదో ఒక సమస్యతో బాధపడే వారి కష్టాలను దూరం చేసేవారు. దీంతో ఆయన్ను ఎంతో ఆరాధ్యంగా దేవుడిగా భావించి, అందరూ పూజించడం ప్రారంభించారు. ఇప్పటికీ ఆయన ఆలయాలకు హిందూ, ముస్లిం అని తేడాలేకుండా అందరూ దర్శించుకుంటున్నారు. కానీ ఈమధ్య ఈయన దేవుడు కాడంటూ శంకరాచార్య స్వరూపానంద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘షిర్డీసాయి ఒక సాధారణ వ్యక్తి అని.. ఆయన దేవుడు ఎలా అవుతాడు’’ అంటూ చేసిన ఆయన వ్యాఖ్యలు పెద్ద సంచలన దుమారాన్నే రేపాయి.

తాజాగా ఇప్పుడు షిరిడీ సాయిబాబా దేవుడు కానే కాదని ధర్మ సంసద్ తీర్మానాలను జారీ చేసింది. ఇకనుంచి ఆయనను ఎవ్వరూ ఆరాధించరాదని హిందువులకు ఆ ధర్మ సంసద్ పిలుపునిచ్చింది. ‘‘షిరిడీ సాయి దేవుడు కాడు’’ అనే విషయం మీద చత్తీస్ గఢ్ లోని కబీర్ ధామ్ జిల్లాలో రెండు రోజుల పాటు ధర్మ సంసద్ చర్చా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హిందూమతానికి చెందిన 13 అఖారాల ప్రతినిధులు, అనేక మంది హిందూ మత ప్రముఖులు హాజరయ్యారు. ఇందుకు హాజరుకావాల్సిందిగా హాజరుకావాలంటూ షిరిడీలోని సాయి సంస్థాన్ కు కూడా ఆహ్వానం పంపినప్పటికీ అక్కడనుంచి ఎవరూ హాజరుకాలేదు.

ఈ సదస్సులో సాయిబాబాపై దీర్ఘంగా చర్చించిన అనంతరం ఆయన దేవుడు కాదని తీర్మానం చేశారు. గతంలో కూడా... మాంసాహారం తిన్న సాయిబాబా సన్యాసి కాదని, హిందువులు ఎవరూ ఆయనను ఆరాధించరాదని ద్వారకా శంకరాచార్య ప్రకటించిన సంగతి తెలిసిందే. కాశీ విద్వత్ పరిషత్ కూడా సాయిబాబా దేవుడు కాదని, గురువు కూడా కాదని తీర్మానించిన విషయాన్ని ఈ సదస్సులో గుర్తుచేసుకున్నారు. ఇలా ఒకరిమీదొకరు సాయిబాబాపై నిత్యం నిందలు వేయడం.. ఆపై ప్రజలు నిరసనలు వ్యక్తం చేయడంతో ఇందుకు పరిష్కారా మార్గాన్ని వెతకడం కోసం ఈ చర్చాసదస్సును నిర్వహించి, చివరికీ ఆయన దేవుడు కాడంటూ నిర్ణయానికి వచ్చి తీర్మానం చేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles