Vijayasai reddy to get rajyasabha seat from ysr congress

jagan mohan reddy, ys rajashekar reddy, sharmila, vijayamma, ys family, jagan case, assets case, cbi on jagan, chanchal guda jail, ysr congress, elections, latest news, politics, vijayasai reddy

vijayasai reddy of ys financial advisor will get rajyasabha seat from ysr congress : jagan decided to send vijayasai reddy to rajyasabha from party

విజయసాయికి వైసీపీ పెద్ద సీటు

Posted: 08/25/2014 12:22 PM IST
Vijayasai reddy to get rajyasabha seat from ysr congress

తనను నమ్ముకుని నట్టేట మునిగిన వారికి ఉపశమనం కల్గించటంపై జగన్ దృష్టి పెట్టారు. ఇందులో ముందు వరుసలో ఉంది విజయసాయిరెడ్డి. జగన్ సంస్థల ఆడిటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి సంస్థల లావాదేవీలన్ని చూసుకునేవారు. ఎక్కడి నుంచి డబ్బు ఎక్కడకు ఎలా వెళ్ళాలి.., ఎలా, ఎప్పుడు రావాలి? ఇలా అన్ని అంశాలు విజయసాయి చూసుకునేవారు. పెట్టుబడుల కోసం కంపనీలను సృష్టించి వాటి నుంచి నిధులను మళ్ళించిన తెలివి సాయిదే అని అందరికీ తెలుసు. ఆ తర్వాత జగన్ కేసుల్లో ఇరుక్కుంటే ఆయనతో పాటు ప్రతి చార్జ్ షీట్ లో నిందితుడుగా చేరారు. ఒకే జైలులో ఇద్దరూ శిక్ష అనుభవించారు. సాయి అంత తెలివి ప్రదర్శించాడు కాబట్టే.., సీబీఐ కూడా కంపనీలన్ని బోగస్ వి అని తేల్చింది తప్ప వాటిలోని నిధులపై స్పష్టమైన సమాచారం సేకరించలేకపోయింది.

తనకింత సాయపడ్డ సాయికి కాస్తయినా సాయం చేయాలని జగన్ తలచారు. పెద్ద మనసుతో పెద్దల సభకు పంపాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది అటుంచితే విజయసాయి ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయాల్సిన వ్యక్తిగా వార్తలు విన్పిస్తున్నాయి. వైఎస్ హయంలో టీటీడీ పాలకవర్గ సభ్యుడిగా ఏడుకొండలవాడికి సేవ చేశాడు. ఆ తర్వాత ఎన్నికల్లో పోటి చేయాలని కష్టపడి డబ్బు కూడబెట్టుకున్నాడు. అయితే సమీకరణాలు సెట్ కాక.. ఫేట్ కలిసి రాలేదు. దీంతో రాజ్యసభ సీటు పక్కా అని జగన్ మాట ఇచ్చి ఓదార్చారు.

ఇచ్చిన మాట ప్రకారం పెద్దల సభలో సీటు ఇవ్వాలంటే విజయసాయి పార్టీలో నేతగా ఉండాలి. లేదంటే రాజకీయ పార్టీలు దుమ్మెత్తిపోస్తాయి. ఈ విషయం ముందుగానే గ్రహించిన జగన్.., ఈ మద్యే విజయసాయిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు. ఆయనకు ప్రజల పట్ల ఉన్న సేవాభావంను చూసే ఈ పదవి ఇచ్చినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడిక  రాజ్యసభ సీటు ఖాళీకాగానే అందులో విజయసాయిని భర్తీ చేస్తారన్నమాట. అటు కేసుల్లో చిక్కుకుని తనతో కష్టకాలంలో అండగా ఉన్న ఇతరులనూ జగన్ ఆదుకుంటున్నారు. ఈ మద్య ప్రకటించిన పార్టీ పదవుల లిస్ట్ చూస్తే ఇది తెలుస్తుంది. ప్రధాన కార్యదర్శులుగా భూమన కరుణాకర్, మోపిదేవి, సుజయ కృష్ణ, ధర్మాన, జంగా కృష్ణమూర్తి, మైసూరా, ప్రసాద్, విజయసాయిలను నియమించారు. ఇందులో ధర్మాన, మోపిదేవి, విజయసాయిలు కేసులో నిందితులుగా ఉన్నవారే. అంటే తనను నమ్ముకున్న వారికి ఎప్పటికైనా న్యాయం చేస్తానని జగన్ సంకేతాలిస్తున్నాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagan  vijayasai reddy  ysr congress  rajyasabha  

Other Articles