Telangana cm kcr plans to desing the saifabad palace as his camp office

cm kcr, nizam palace, saifabad palace, cm kcr latest news, cm kcr camp office, cm kcr camp office saifabad palace, cm kcr golconda fort, saifabad nizam palace

telangana cm kcr plans to desing the saifabad palace as his camp office

నిజాం ప్యాలెస్ మీద సీఎం కేసీఆర్ కన్ను!

Posted: 08/25/2014 12:27 PM IST
Telangana cm kcr plans to desing the saifabad palace as his camp office

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన కేసీఆర్... కొన్ని వినూత్నమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన రాష్ట్రాభివృద్ధిలో భాగంగా పోలీసుల వాహనాలను పూర్తిగా మార్చేశారు. అలాగే ఇంతవరకు ఎన్నడూ చేయలేని విధంగా ‘‘గోల్కొండ కోట’’లో పంద్రాగస్టు వేడుకలను నిర్వహించి.. సరికొత్త సంచలనానికి నాంది పలికారు. ఇక సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి పెట్టుబడిదారులను తమ రాష్ట్రానికి తీసుకొచ్చే దిశలో ఆయన పూర్తిగా నిమగ్నమై వున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన మరో సంచలనాన్ని సృష్టించేందుకు పావులు కదిపినట్టు తెలుస్తోంది.

కేసీఆర్ సచివాలయంలో శిథిలావస్థలో వున్న సైఫాబాద్ ప్యాలస్ ను తన సీఎం కార్యాలయంగా మార్చుకోనున్నారని విశ్వసనీయ సమాచారం! గత దశాబ్దకాలంగా ఆనాటి ప్రభుత్వం ఈ భవనంలో ఏ కార్యాలయాలన ఏర్పాటు చేయలేదు. పైగా అది పూర్తి శిథిలావస్థకు చేరుకుని, కూలిపోవడానిక్కూడా సిద్ధంగా వుంది. ఆ భవనం వున్న ప్రాంతంవైపు వాహనదారులు, ప్రజలు వెళ్లడానికి భయపడుతూ వుంటారు. ఒకవేళ దీనిని మరమ్మత్తు చేయాలనుకున్నా.. 2008వ సంవత్సరంలో వేసిన అంచనాల ప్రకారం దాదాపు 8 కోట్లు అవుతుంది. అయినప్పటికీ కేసీఆర్ ఆ భవానాన్నే తన కార్యాలయంగా తీర్చిదిద్దుకోవడానికి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

1914 - 1915 మధ్యకాలంలో ఏర్పాటు చేసిన ఈ సైఫాబాద్ ప్యాలెస్ ను తన కార్యాలయంగా మార్చుకోవడంతోపాటు దీని మరమ్మత్త కోసం దాదాపు 20 కోట్ల రూపాయలవరకు డబ్బులను కేటాయిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇదిలావుండగా.. కేసీఆర్ ఇంతవరకు చేస్తున్న కార్యకలాపాలను చూస్తుంటే.. ఆయనకు నిజాం పాలన మీద ఎక్కువ మక్కువ వున్నట్టు తెలుస్తోంది. పంగ్రాగస్టు వేడుకలు గోల్కొండలో చేయగా.. సుల్తాన్ బజార్, మొజంజాహి మార్కెట్ లోని చారిత్రిక కట్టడాలు పాడవకుండా మెట్రోరైలు మార్గాన్ని కూడా మార్చేశారు. ఇంకా రానురాను ఆయన ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  nizam palaces  telangana cm camp office  saifabad palace  

Other Articles