Pakisthan army ceasefire on 40 indian posts 24 villages

pakisthan army, pakisthan troops, india pakishtan border, kashmir, jammu kashmir, indian army, bsf, army recruitment, latest news, defence, nawaz sharif, narendra modi, modi comments on pakisthan, kargil, pakisthan cease fire

pakisthan army ceasefired on 40 indian bsf posts along border and fired on 24 villages : pakisthan voilates ceasefire agreement 21times in 15 days again fired today on indian posts

భారత గ్రామాలపై పాక్ ఆర్మీ బాంబులు

Posted: 08/25/2014 11:39 AM IST
Pakisthan army ceasefire on 40 indian posts 24 villages

పాకిస్థాన్ దుశ్చర్యలకు అడ్డు అదుపూ లేకుండా పోతుంది. పోనీలే అని భారత్ ఊరుకుంటుంటే దాయాది సైన్యం ఇదే అదునుగా రెచ్చిపోతుంది. భారత స్థవరాలపై తుపాకులతో విరుచుకుపడుతుంది. మదమెక్కిన పాక్ ఆర్మీ.., కయ్యానికి కాలు దువ్వుతూ భారత సరిహద్దుపై కాల్పులు జరుపుతోంది. జమ్మూ కాశ్మీర్ సాంబ జిల్లాలోని  ఆర్నియా, ఆర్ ఎస్ పురా, కానాచక్, అఖ్నూర్ సెక్టార్లపై విరుచుకుపడ్డాయి, ఆదివారం అర్ధ రాత్రి కాల్పులు మొదలుపెట్టిన పాకిస్థాన్ ఈ ఉధయం వరకు కూడా కాల్పులు జరుపుతూనే ఉంది. అయితే వీరికి భారత సైన్యం కూడా తుపాకులతో ధీటుగా సమాధానం ఇవ్వటంతో ఎలాంటి నష్టం జరగలేదు.

గ్రామాలపైకి మోర్టార్ బాంబులు

సరిహద్దులోని భారత సైనిక స్థావరాలతో పాటు సమీప గ్రామాల్లోని అమాయక ప్రజలను కూడా పాక్ టార్గెట్ చేసుకుంది. సరిహద్దలోని 24గ్రామాలపై విచక్షణా రహితంగా ఉగ్రవాదుల్లా కాల్పులకు తెగబడింది. అంతేకాకుండా మోర్టారు బాంబులను విసిరేసింది. ఈ బాంబులు పేలి ముగ్గురు గ్రామస్తులు గాయపడ్డారు. వీరిని ఆర్మి ఆస్పత్రికి తరలించారు. రాత్రి నుంచి ఈ ఉదయం వరకు కూడా భారత స్థావరాలు, సరిహద్దు గ్రామాలపై దాయాది ఆర్మీ కాల్పులు జరుపుతుండటంతో సామాన్య ప్రజలు భయంతో వణికిపోయారు. ఎప్పుడేం జరుగుతుందో అని రాత్రంతా నిద్రపోకుండా భయపడుతూ గడిపారు. ప్రస్తుతం ఈ గ్రామాల్లో భారత సరిహద్దు రక్షణా దళం ఆదీనంలోకి తీసుకుని పహారా కాస్తుంది.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘిస్తూనే ఉంది. గత 15 రోజుల్లోనే 23సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఆర్మీ ఉల్లంఘించింది. ఇక  జులై 16 నుంచి ఇప్పటి వరకు 33 సార్లు భారత్ పై కాల్పులు జరిపింది. తాము భారత్ తో సన్నిహిత సంబంధాలు కోరకుంటున్నట్లు చెప్తూనే.., సరిహద్దుపై కాల్పులకు పాల్పడుతోంది. ఉగ్రవాదాన్ని పాక్ ఆర్మీ పెంచి పోషిస్తోందని ప్రధాని మోడి వ్యాఖ్యలు చేస్తే.., దీనిపై పాక్ ఆర్మీ స్పందించలేదు. దీన్నిబట్టే వారేమిటో అందరికి అర్ధం అవుతోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cease fire  indian border  pakisthan army  latest news  

Other Articles