Bollywood hero riteish deshmukh hands burn in movie shooting

Riteish Deshmukh, burn injuries, bangistan, Riteish Deshmukh and Pulkit Samrat, geniliya housband, Riteish Deshmukh, actor madala ravi arrest,

bollywood hero riteish deshmukh hands burn in movie shooting: actor Pulkit Samrat, who debuted in Bollywood with Bittoo Boss ... Bangistan is a satire which will have Riteish Deshmukh and Pulkit

జెనీలియా భర్తకు చేతులు కాలితే- తెలుగు హీరో అరెస్ట్ !

Posted: 08/13/2014 04:45 PM IST
Bollywood hero riteish deshmukh hands burn in movie shooting

హీరోయిన్ జెనీలియా భర్త బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ కు చేతులు కాలాయి. బంగిస్థాన్ అనే సినిమా షూటింగ్ జరుగుతుండగా చిన్నపాటి ప్రమాదం సంభవించడంతో ఆయన చేతులు కాలాయి. ఈ విషయాన్ని స్వయంగా రితేష్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

సినిమాలో నటించేటప్పుడు సహజత్వం రావాలంటే ఇలాంటి సాహసాలు చేయడం తప్పనిసరి అవుతోంది. ఇటీవలి కాలంలో చాలామంది హీరోలు సహజంగా కనిపించడం కోసం ఫైట్లలో కూడా సాహసాలు చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న జెనీలియా . వెంటనే రితేష్ దేశ్ ముఖ్ చేస్తున్న షూటింగ్ స్పాట్ కు పరుగులు పెట్టినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. చిన్నపాటి గాయలతో రెండు చేతులు కాలినట్లు తెలుస్తోంది!

madala-ravi-arrest

తెలుగు హీరోను పోలీసులు అరెస్ట్ చేశారు!

మాదాల రంగారావు తనయుడు, సినీ నటుడు మాదాల రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. యువతిని వేధించిన కేసులో మాదాల రవిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. పెళ్లిన హీరోగా పేరు తెచ్చుకున్నాడు మాదాల రవి. అయితే మరో పెళ్లికాని అమ్మాయితో కొంతకాలంగా ప్రేమాయణం సాగించినట్లు తెలుస్తోంది. ఆ యువతికి ఇటీవల మరో యువకుడితో పెళ్లి నిశ్చితార్థం కావటం, అప్పటి నుండి రవికి దూరంగా ఆ యువతి ఉంటుంది. దీంతో.. ఆ యువతి పై కక్ష పెంచుకొని, ఆమె కనిపించిన ప్రతి చోట .. తను కలసి దిగిన ఫొటోలను బహిరంగపరచి ఆ యువతిని బెదిరించాడు.

అంతే కాకుండా ఆ యువతి పెళ్లి చేసుకోబోయే యువకుడికి కూడా ఆ ఫోటోలను మెయిల్ చేశాడు. ఆ విధంగా వేధించడంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ యువతి ప్రముఖ రాజకీయ నాయకుడి ముద్దుల కూతురు అనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు హీరో గారి విషయం ఫిలింనగర్లో టాక్ ఆఫ్ టౌన్ గా మారిపోయింది.

టాలీవుడ్ తెరపై 'ఎర్రమల్లెలు' చిత్రంలో 'నాంపల్లి స్టేషన్ కాడ...' పాటతో బాల నటుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన రవి సోవియట్ యూనియన్ లో డాక్టర్ పూర్తి చేశారు. రవి ‘నేను సైతం’ అనే సినిమాలో హీరోగా చేశాడు. ఆ తరువాత ఇలవేల్పు, బ్రోకర్-2 చిత్రాలలో కూడా నటించారు. ఇప్పుడు ఇలా పోలీసులు అరెస్ట్ చేశారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Riteish Deshmukh  bollywood news  bollywood latest movies  Bangistan movie details  

Other Articles