Mp bura narsaiah comments on tdp mps

bura narsaiah, telangana, telangana bhavan, tdp office, ntr bhavan, tdp mps, kcr, chandrababu naidu, telangana survey, hyderabad high court, home ministry

bura narsaiah fires on tdp mps : every one must support telangana government survey dont oppose it says bura narsaiah

టిడిపి ఎంపీలకు పచ్చకామెర్లు

Posted: 08/13/2014 05:36 PM IST
Mp bura narsaiah comments on tdp mps

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సర్వేపై అన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వం చెప్తున్న ఉద్దేశాలు వేరు, సర్వే అసలు ఉద్దేశం వేరు అని అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కోర్టులో కూడా విచారణ జరుగుతోంది. చివరకు హోం శాఖ కూడా సర్వేపై సమాచారం ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరింది. ఇంత జరుగుతున్నా.., ఇంతమంది అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నా సర్వే మాత్రం ఆగదని చెప్తోంది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాదు తమపై, సర్వేపై విమర్శలు చేస్తున్నవారికి గులాబీ నేతలు ఘాటు మాటలతో సమాధానం చెప్తున్నారు. తాజాగా సర్వే చట్ట విరుద్ధం, దారుణమంటూ విమర్శలు చేసిన టీడీపీ ఎంపీలపై టీఆర్ఎస్ మాటల దాడి చేసింది.

సర్వే సరికాదన్న టీడీపీ ఎంపీలపై టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. వృత్తిరిత్యా డాక్టర్ అయిన బూర.., సైకిల్ ఎంపీలపై కూడా తన స్టైల్ లో విమర్శించారు. టీడీపీ ఎంపీలకు పచ్చకామెర్లు వచ్చాయన్నారు. వారు రోగుల్లా వ్యవహరిస్తున్నారని ద్వజమెత్తారు. మరి ఆ రోగులు ఎలా వ్యవహరిస్తారో డాక్టర్ కాబట్టి ఆయనకైతే బాగానే తెలుసు. తప్పు చేసే వారికి ప్రతీది తప్పుగా కన్పిస్తుందని ఎద్దేవా చేశారు. ఎంపీలు త్వరగా ఆస్పత్రిలో చూపించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడూ సర్వేను వ్యతిరేకించరు అన్నారు. గతంలో ప్రభుత్వాలు ఎప్పడూ సర్వే చేయలేదా అని ప్రశ్నించారు. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ సారి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తామని నర్సయ్య స్పష్టం చేశారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tdp mps  bura narsaiah  telangana bhavan  telangana survey  

Other Articles