Pranab slams tdp and tmp mps over parliament room issue

pranab mukarjee, indian president, parliament, loksabha, rajyasabha, mps list, mps names, election results, cabinet ministers names list, modi, prime minister of india, latest news, rastrapathi bhavan, tdp mps, telugu desham party, chandrababu naidu, trinamool congress party, mamata benarjee, trinamool mps attack on tdp office in parliament

president pranab mukarjee feels sad about parliament members behaviour : pranab requests mps to behave polite in parliament and protect vast heritage of india

పరువు కాపాడండి..! ప్లీజ్ !!

Posted: 08/13/2014 04:19 PM IST
Pranab slams tdp and tmp mps over parliament room issue

ప్రపంచంలో మనదేశానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది. అంతేకాదు ప్రజాస్వామ్య విలువలు పాటించటంలో అందరూ మనల్ని చూసి గౌరవిస్తారు. చట్టాలు చేసే గౌరవ శాసనకర్తలు ఈ మద్య అ గౌరవ పనులు చేస్తున్నారు. సమాజంలో వారి దాడులు, బల ప్రదర్శనకు స్థలం సరిపోనట్లు పార్లమెంటును వాడుకుంటున్నారు. మాటలు అనుకునే స్థాయి దాటి దాడులకు తెగబడుతున్నారు. ఇది గతంలో పలుమార్లు మనం చూశాం. పెప్పర్ స్ప్రే ఇందుకు ఉత్తమ ఉదాహరణ. అయితే ఈ సంస్కృతి కొనసాగటంపై రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ విచారం వ్యక్తం చేశారు. మృదు స్వభావిగా, తక్కువ మాట్లాడే ప్రణబ్.., తన స్టైల్లోనే ఎంపీలకు తలంటారు. ప్రత్యేకించి టిడిపి, తృణముల్ పార్టీ సభ్యులకని చెప్పాలి.

పార్లమెంటు భవనంలోని గ్రౌండుఫ్లోర్ 5 నెంబరు గది కోసం తృణమూల్ కాంగ్రెస్, టీడీపీ సభ్యులు బాహాబాహీకి దిగారు. చాలాకాలంగా 5వ నెంబర్ గది టీడీపీ ఆధీనంలో ఉంది. అయితే ఎన్నికల్లో వచ్చిన సీట్ల దృష్యా ఈ గదిని తృణమూల్ కాంగ్రెస్కు కేటాయించారు. కానీ గది ఖాళీ చేసేందుకు టీడీపీ సభ్యులు నిరాకరించడంతో గొడవ మొదలైంది. చివరకు మంగళవారం రోజు 5వ నెంబర్ గదికి ఉన్న టిడిపి బోర్డులు, సభ్యుల నేమ్ ప్లేటులు తొలగించి పక్కన పడేశారు, రూంను బలవంతంగా తృణముల్ సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ప్రణబ్ కలత చెందారు.

పార్లమెంటు సభ్యులు కాస్తయినా మర్యాదగా వ్యవహరించాలని ప్రణబ్ విజ్ఞప్తి చేశారు. వ్యక్తులుగా కాకపోయినా సభ సభ్యులుగా హుందాగా ఉండాలన్నారు. పార్లమెంటు గౌరవాన్ని గుర్తుంచుకుని మెలగాలని హితవు పలికారు. ఉత్తమ పార్లమెంటేరియన్లకు అవార్డులు ఇచ్చే కార్యక్రమంలో రాష్ర్టపతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పార్లమెంటు గౌరవ మర్యాదలు, సభ ప్రాముఖ్యతను వివరించారు. అలాగే కొందరు సభ్యులు ప్రవర్తిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. "దయచేసి... మీకు పుణ్యం ఉంటుంది, పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు సభ గౌరవ మర్యాదలను కాస్తంతైనా కాపాడండి. ఇది మీరు తప్ప ఇంకెవరూ చేయలేరు" అని రాష్ర్టపతి విజ్ఞప్తి చేశారు. తొలిసారి పార్లమెంటు భవనంలోకి ప్రవేశించినప్పుడు ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటు మెట్ల మీద శిరస్సు వంచి ప్రణమిల్లడం తన గుండెను తాకిందని రాష్ట్రపతి చెప్పారు. ప్రజాస్వామ్య దేవాలయానికి ఉన్న పవిత్రతకు ఇది నిదర్శనమన్నారు. అలాంటి సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందన్నారు. ప్రణబ్ హితబోధతో అయినా సభ్యులు మారుతారో.. లేక దున్నపోతు మీద వాన పడిన చందంలా దులిపేసుకుంటారో సభలో చూడాలి

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pranab mukarjee  modi  tdp  trianmool congress  

Other Articles