Telangana government survey details

telangana government, telangaana survey, kcr, andhrapradesh news, latest news, political news, telangana ap states

telangana government survey go gather all information about every individual : with survey all details of every person must tell

అన్నీ విప్పి చెప్పాల్సిందే..!!

Posted: 08/12/2014 12:26 PM IST
Telangana government survey details

telangana-government-survey-1

telangana-government-survey-2

తెలంగాణ ప్రభుత్వం సర్వే చేస్తోంది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఏపీ వారికి ఎలాంటి ప్రభుత్వ ఫలాలు అందరాదని మొక్కవోని దీక్షతో ఉన్న కేసీఆర్ పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ సర్వే చేయాలని స్పష్టం చేస్తున్నారు. ఎవరు ఎటు పోయినా 19వ తేదీన ఇంట్లో లేకపోతే లెక్కల్లో లేనట్లే అని చెప్తున్నారు. చివరకు ఆస్పత్రిలో చేరినా అక్కడ కూడా ఓ సర్వే అధికారి వివరాలు సేకరించేందుకు సిద్ధంగా ఉంటారట. ప్రత్యేక రాష్ర్టం, ప్రభుత్వం ఏర్పడటంతోనే కేసీఆర్ ప్రత్యేక విధానాలు రూపొందించటం మొదలు పెట్టారు. ఫాస్ట్ పధకం, 1956 స్థానికత, ప్రత్యేక ఎంసెట్ కౌన్సిలింగ్ ఇలా నా రూటే సపరేటన్నట్లు ప్రతీది ప్రత్యేకమే.

ఎందుకిలా?

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఫీజు రి ఎంబర్స్ మెంట్, స్థానికత నిర్ధారణపై పెద్ద వివాదం చెలరేగటంతో అప్రమత్తమైన ప్రభుత్వం, ఆంధ్రావారి లెక్కలు తేల్చేందుకు ఈ సర్వే తీసుకొచ్చినట్లు పొలిటికల్ వర్గాల నుంచి గుసగుసలు వస్తున్నాయి. పేరుకు మాత్రం గత ప్రభుత్వాల అవినీతి అక్రమాల వెలికతీత అని చెప్తున్న అసలు మ్యాటర్ ఇది కాదులే బ్రదరూ అంటున్నారు. సర్వేలో అంతా తెలంగాణ ఉద్యోగులే పాల్గొంటున్నారు. లోకల్ ఫీలింగ్ ను వంటబట్టించుకున్న వారు ఖచ్చితంగా వాస్తవాలు వెలికితీస్తారని ప్రభుత్వం బావిస్తోంది. ఈ దెబ్బతో ఆంధ్రా వారిని లెక్కగట్టి వారిని పక్కనబెట్టాలని పావులు కదుపుతోంది. ఇది అక్రమమని. దుర్మార్గపు చర్య అని ఎవరు ఎంత విమర్శిస్తున్నా.., సింపుల్ గా సీతయ్య సినిమా డైలాగ్ తెలియదా అని చెప్తోంది తెలంగాణ ప్రభుత్వం.

అన్నీ విప్పి చెప్పాల్సిందే...!!

అయితే ఇందులో ఏ ప్రశ్నలు అడుగుతారు.., ఎలాంటి వివరాలు సేకరిస్తారు అనే ప్రశ్నలు అందరి మదిని తొలుస్తున్నాయి. సాధారణంగా సర్వేల్లో యజమాని పేరు, కుటంబ సభ్యుల సంఖ్య, ఆదాయ మార్గం, ఆస్తులు వంటి వివరాలు అడుగుతారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి వివరాలను సేకరిస్తున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఒకే ఇంట్లో వేరుగా నివసించే కుటుంబాలు, పిల్లల చదువులు,  బ్యాంకు అకౌంట్ నెంబర్లు, భూముల వివరాలు, ఉన్న రోగాలు, వ్యాధులు... ఇలా ఒకటేమిటి ఒక వ్యక్తికి సంబంధించి అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండేలా ప్రశ్నలు రూపొందించారు.

స్థానికతపై ప్రశ్న

సర్వేపై దుమారం రేగటంతో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం స్థానికత జోలికే వెళ్ళమనీ.., అసలు ఆ ప్రశ్నే అడగటం లేదని చెప్తోంది. అయితే నమూనా ఫాంలో మాత్రం చివరి కాలంలో స్థానికత ప్రశ్న ఉంది. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారి వివరాలు అని ప్రత్యేక కాలం ఉంది. ఇందులో ఏ రాష్ర్టం నుంచి వచ్చారు. మాట్లాడే బాష, వచ్చిన సంవత్సరం అని మూడు ప్రశ్నలున్నాయి. ప్రస్తుతం ఏపీ నుంచి తెలంగాణ విడిపోయింది. ఉమ్మడి రాష్ర్టంగా ఉన్నపుడు తెలంగాణకు వచ్చినవారు ఇక్కడి వారవుతారా లేక వారు పక్క రాష్ర్టం నుంచి వచ్చిన వారవుతారా అనేది సర్వే అధికారే చెప్పాలి. అంతేకాదు 1956 స్థానికత అంశంపై గందరగోళం నెలకొనటంతో ఎవరు ఎప్పుడు ఇక్కడకు వచ్చి సెటిలయ్యారో తెలుసుకుని ఓ నిర్ణయం తీసుకునేందుకు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఎవరు సీమాంధ్ర వారో తెలిసిపోతుంది. వివరాలను కంప్యూటరైజ్ చేయటంతో పాటు ప్రతి ప్రభుత్వ పధకంకు ఆదార్ తప్పనిసరి చేస్తారు. ఈ సమయంలో ఏపీ నుంచి వచ్చినట్లుగా వారి వివరాలు నమోదు చేస్తే.., ఇక ప్రభుత్వ ఫలాలను అందుకోలేరు. వారిని పూర్తిగా పక్కన బెట్టేందుకే ఈ కాలం ప్రత్యేకంగా ఈ సర్వే ఉద్దేశ్యం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  survey  kcr  latest news  

Other Articles