Telangana cm kcr tortured to tdp leader errabelli dayakar rao

Errabelli Dayakar Rao, Escort Remove, Warangal, TRS Government

telangana cm kcr tortured to tdp leader Errabelli Dayakar Rao: Telangana TDP senior leader Errabelli Dayakar Rao on asked Chief Minister K Chandrasekhar Rao to clarify as to why he remained

ఎర్రబెల్లిని ఏడిపించిన సిఎం కేసిఆర్!

Posted: 08/12/2014 11:52 AM IST
Telangana cm kcr tortured to tdp leader errabelli dayakar rao

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తన విశ్వరూపం చూపించారు. దీంతో తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకరరావు గుక్కపెట్టి ఏడ్చాడు! తెలంగాణ సీఎం కేసిఆర్ అనుకున్నది సాధిస్తాడని తెలుసు.. కానీ ఇలా …!! రాజకీయ నేతలను, ప్రజలను, రైతులను, విద్యార్థుల తల్లిదండ్రులను ఒకేసారి ఏడిపాస్తాడని ..ఎవరికి తెలియదు.

ఆంధ్రనేతల పై పగతో.. తెలంగాణ నేతలకు, ప్రజలకు తీవ్రమైన కష్టాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ గురిచేస్తున్నాడు. ఆయన పాలన సాగించి 60 రోజులు నిండిన.. కేసిఆర్ లో ఎలాంటి మార్పులు రాలేదు. ఒక ఉద్యమ నేతగానే పాలన సాగిస్తున్నాడనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

కేసిఆర్ పై.. ఎవరు ఎక్కువుగా ఫోకస్ పెడతారో వారిపై ..కక్షకట్టి, పగ తీర్చుకోవటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కేసిఆర్ ఆవేశానికి రెండు మీడియా ఛానల్స్!! కట్టుకున్న ఇల్లు, తెలంగాణలో కనిపించకుండా పోయాయి. అయితే ఈరోజు తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు పై.. కేసిఆర్ దృష్టి సారించారు.

ముందుగా టిడిపి ఎర్రబెల్లి దయాకరరావు ఉన్న ఎస్కార్ట్ ను తొలగించి మస్తు ఆనందపడ్డారు. ఎర్రబెల్లి వద్ద గన్ మెన్ లను తగ్గించటం జరిగింది. దీంతో ఆయా గన్ మెన్ లు నిరసన చేపట్టారు. కావాలనే టీఆర్‌ఎస్ తనపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఎర్రబెల్లి ఆరోపించారు. తనకేమైనా జరిగితే టీఆర్‌ఎస్‌(కేసిఆర్) బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

దీనికి కారణం ఉంది.. ఆదివారం మీడియా ముందు ఎర్రబెల్లి దయకరరావు ..తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఘాటైన విమర్శలు చేసినందుకే.. ఎర్రబెల్లికి ఎస్కార్ట్ తగ్గించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏమైన కేసిఆర్ కు కోపం వస్తే.. ఫలితం కొంచెం ఘాటు గా ఉంటుందని సీఎం కేసిఆర్ మరోసారి నిరూపించారు. ఎర్రబెల్లిని ఏడిపించిన వారు ఎవ్వరు రాజకీయ చరిత్రలో బతికినట్లు లేదని .. ఎర్రబెల్లి అభిమానులు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana political news  cm kcr vs errabelli  tdp vs trs  

Other Articles