Flag hoisting in telangaana state

telangaana higher education counselling, eamcet counselling, telangaana news, ap news, students, engeneering colleges in telangaana andhrapradesh, top engeneering colleges, fee fee reimbursement

telangaana higher education council decides to held seperate counselling : two telugu states going to held seperate counsellig for eamcet admissions contreversy on eamcet counselling going on

ఆ జెండా వద్దంటారేమో!!

Posted: 08/12/2014 11:40 AM IST
Flag hoisting in telangaana state

మన రాష్ర్టం, మన పాలన, మన ఉద్యోగాలు, మన నీళ్ళు, మన నిధులు. ఈ మాటలు వినగానే ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చేది తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ పార్టీ. స్థానికతను, ఆత్మగౌరవ సమస్యను ప్రజల్లోకి అంతగా తీసుకెళ్ళి ప్రత్యేక రాష్ర్టం సాధించారు పార్టీ అధినేత కేసీఆర్. ఆయన నేతృత్వంలో నడుస్తున్న తొలి ప్రభుత్వం కూడా స్థానికతకే అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతి విభాగంలో తెలంగాణ వారిని బాధ్యతాయుత పదవుల్లో కూర్చోబెడుతోంది. తెలంగాణ అంటే చాలు అక్కున చేర్చుకుంటోంది. అదే ఆంధ్రా అనే వరకు ఆగ్రహంతో ఊగిపోతుందీ ప్రభుత్వం. స్వపరిపాలన, స్వరాష్ర్టం, స్వీయ అస్తిత్వం అనే మాటలను నిలువునా జీర్ణించుకున్న కేసీఆర్ ఆగస్టు పదిహేనున ఏం చేస్తారో అని కొందరి మదిలో ఓ చిలిపి ప్రశ్న మెదులుతోంది.

పూర్తి స్థానికతకు, తన మార్కు ఐడెంటిటీకి ప్రాధాన్యిమిస్తున్న కేసీఆర్, చివరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కూడా తన ప్రత్యేకతను చాటారు. ఇన్నాళ్ళూ ఆగస్టు పదిహేను వేడుకలకు పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఉండేది. ఆంధ్రావాళ్ళు వాడిన వేదికపై మనమెందుకు జరపాలి అనుకున్నారు కాబోలు., ఏకంగా కార్యక్రమ ఈ స్థలాన్ని కూడా మార్చేశారు. చారిత్రక గోల్కొండ కోటలో వేడుకలకు సారు సన్నద్దం అవుతున్నారు. ఆయనేది ముట్టుకున్నా అంటే అన్నట్లు దీనిపై కూడా వివాదాలు వచ్చాయి లెండి. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా కూర్చుని అధికారులను హడావుడిపెట్టి ఎట్టకేలకు కోటలో జెండా పాతేంగే అన్నారు.
ఏ జెండా ఎగరేస్తారు?

ఇదేం ప్రశ్న? ఆగస్టు పదిహేనున జాతీయ జెండా కాకుండా మరొకటి ఎగరేస్తారా ఏమిటి అనుకుంటున్నారా? అందరూ అయితే జాతీయ జెండానే ఎగరేస్తారు. కానీ సారు కేసీఆర్. సొంత అస్తిత్వాన్ని కోరుకునే వ్యక్తి. అసలే ఉద్యమం సమయంలో ఆంధ్రా వస్తువులు గో బ్యాక్ అని అండర్ కవర్ నినాదాలు ఇప్పించారు. అలాంటిది ఆంధ్రా వ్యక్తి అయిన పింగళి వెంకయ్య గారు రూపొందించిన జెండా ఎగరేస్తారా మరి. ఈ ప్రశ్న ఇప్పుడు పలువురిలో ఆసక్తికరమైన చర్చను రేపుతోంది. చూడటానికి సిల్లీగా ఉన్నా దీన్ని పరిగణలోకి తీసుకుంటే పెద్ద చర్చే జరుగుతుంది. ఆంధ్రా ఉద్యోగులు, ఆంధ్రా బోజనం, ఆంధ్రా వస్తువుల వద్దన్న తెలంగాణ ముఖ్యమంత్రి పంద్రాగష్టుకు ఏం చేస్తారో మరి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eamcet counselling  telangaana  andhrapradesh students  

Other Articles