Anam vivekanandhareddy angry to telangana cm kcr

anam vivekananda reddy, congress party, tdp, chandhra babu, cm kcr, telangana state, anam brothers

anam vivekanandhareddy angry to telangana cm kcr: EX Minister and Congress member Anam Vivekananda Reddy while talking to media ... Vivekananda Reddy expressed his anger over the manner in which KCR is setting

ప్రాణం పోతే కాంగ్రెస్ లోనే పోవాలి?

Posted: 08/06/2014 04:40 PM IST
Anam vivekanandhareddy angry to telangana cm kcr

ప్రాణం పోతే కాంగ్రెస్ పార్టీలోనే పోవాలని నెల్లూరు కాంగ్రెస్ పార్టీకి ముద్దు బిడ్డలు ఆనం బ్రదర్స్ అంటున్నారు. నిన్నటి వరకు ఆనం బ్రదర్స్ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ ఎక్కుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఈ ఇద్దరి ఏ రహస్య ఒప్పందం జరిగిందో తెలియదు గానీ, ఇప్పుడు ఆనం వివేకానందరెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే మా ప్రాణాలు పోవాలని మీడియా ముందు చెప్పటం జరిగింది. మేము మా ప్రాణాలు ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని చెప్పటమే కాదు.. టీడీపీలోను, బీజేపిలోను మేం ఎప్పటికి చేరమని కుండ బద్దలు కొట్టారు.

ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై మండిపడ్డారు. కేసీఆర్ కు భారత చట్టాలంటే గౌరవం లేదని అన్నారు. స్థానికతను విద్య, ఉద్యోగాల్లో అడుగుతారని, ప్రాధమిక విద్య ఏడేళ్లు ఎక్కడ సాగితే దానిని స్ధానికతగా నిర్ధారిస్తారని ఆయన చెప్పారు.

విజయనగరం జిల్లా నుంచి వలస వచ్చిన కేసీఆర్ స్థానికుడా? ఇక్కడే పుట్టిన ప్రజలు స్ధానికులు కాదా? అని ఆయన ప్రశ్నించారు. స్థానికతకు 1956 ప్రాతిపదిక అయితే లక్షలాది కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles