Playboy magazine private pub in hyderabad

playboy magazine, playboy magazine new branch, playboy magazine hyderabad branch, playboy private pub hyderabad, playboy magazine models, hyderabad pub

playboy magazine private pub in hyderabad : The american playboy magazine group is launching a private pub in hyderabad city. telangana government is also gave permission for this.

తెలంగాణాలో అడుగుపెట్టిన ‘‘బూతు’’ మేగజైన్!

Posted: 08/06/2014 05:49 PM IST
Playboy magazine private pub in hyderabad

హైదరాబాద్ నగరంలో నివాసం వుంటున్న యువకులకు ఇదొక పెద్ద ఆఫర్! ఇంతవరకు సాధారణ క్లబ్బుల్లో ఎంజాయ్ చేస్తూ కాలం గడిపిన యువకులకు... త్వరలోనే అమెరికాకు చెందిన ఒక ఫేమస్ బూతు క్లబ్ రాబోతోంది. దీనిని నిర్మిస్తున్నది మరెవరో కాదు... అశ్లీలానికి మారుపేరుగా నిలిచిన ‘‘ప్లే బాయ్ మేగజైన్’’ సంస్థవారు! ఈ మేగజైన్ కేవలం అమెరికాలోనే కాదు.. యావత్తు ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన న్యూడ్ మేగజైన్ గా పేరు నమోదు చేసుకుంది.

‘‘ప్లే బాయ్’’ మేగజైన్ గురించి తెలియని పురుషులు, మహిళలు ఎవ్వరూ వుండరు. దీనికున్న చరిత్ర గురించి చెప్పుకుంటే చాలానే వుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. మోడల్స్ కు భారీ వేతనాలు ఇచ్చి వారితో నగ్నంగా ఫోటోలు తీయించుకుని వాటితో సొమ్ము చేసుకోవడమే పని! బాలీవుడ్ సెక్సీ తార షెర్లిన్ చోప్పా కూడా ఈ మేగజైన్ కోసం తన న్యూడ్ అవతారాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే! అది అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపిందిలెండి!

ఇప్పుడు తాజాగా ఈ అశ్లీల మేగజైన్ గ్రూపువారు తెలంగాణాలోని హైదరాబాద్ నగరంతోపాటు గోవా, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో పబ్ లు ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతూ 2012లో దరఖాస్తు చేసుకుంది. అప్పట్లో ఇది అశ్లీలానికి తావు లేకుండా పబ్ లను నిర్వహిస్తామని ప్రభుత్వాలకు హామీ కూడా ఇచ్చినప్పటికీ.. ఏ ప్రభుత్వమూ పబ్ ల నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఏమి చేయలేక చివరికి సన్ షైన్ రిసార్ట్స్ పేరుతో గోవాలో ఒక రిసార్ట్ ను ఏర్పాటు చేసింది. మిగతా ప్రాంతాల్లో పబ్ లను ఏర్పాటుకు తీవ్ర సన్నాహాలు చేస్తూనే వుంది.

ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో ఒక బూతు పబ్ ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది ప్లేబాయ్ మేగజైన్. ఇందుకు వారు ప్రభుత్వాన్ని అనుమతి కోరగా.. వెంటనే ప్రభుత్వం కూడా మంజూరు చేసేసింది. అంతే! ఆలస్యం చేయకుండా నగర శివారులో నిర్మాణం పనులను చేపట్టింది. ప్రస్తుతం ఓ ప్రముఖ హోటల్ లో లాంఛనంగా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇందులో పాల్గొనేందుకు సిటీలో వున్న బిగ్ షాట్స్ అందరూ పోటీ పడుతున్నారు! ఇంకో విషయం ఏమిటంటే.. ఇందులో పాలుపంచుకోవడానికి పలువురు ఉన్నతాధికారులు కూడా వుండటం చర్చనీయాంశంగా మారింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles