Telangana government survey hits weddings on 19th

Telangana government household survey, household survey, Telangana CM KCR, survey by Telagana government, Comprehensive household

Telangana government survey hits weddings on 19th:Telangana chief minister K Chandrasekhar Rao has appealed to people to stay in their respective homes and postpone all the important events on August 19th as the government conducts Comprehensive household survey.

తెలంగాణలో పెళ్లిళ్ళు బంద్ చేయండి? కేసిఆర్

Posted: 08/06/2014 03:30 PM IST
Telangana government survey hits weddings on 19th

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏది చేసిన, ఏదీ మాట్లాడిన ఒక సంచలనమే, అది వివాదమే అవుతుంది. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసిఆర్ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఫలితం మాట పక్కన పెడితే.. పది నిమిషాల్లో వంద వరాలు కురిపిస్తున్నారు మన సీఎం కేసిఆర్. తెలంగాణ ప్రజల కోసం ప్రత్యకంగా ఆయనే రంగంలోకి దిగి కొత్త కొత్త పథకాలను అమలు చేస్తూ .. తెలంగాణ ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నారు. సీఎం కేసిఆర్ ప్రకటించిన, ఇచ్చిన వరాల మాటలకు.. తెలంగాణ ప్రజలు పగటి కలలు కంటున్నారు. అందుకే సీఎం కేసిఆర్ ఆగమేఘాల మీద దూసుకుపోతున్నాడు.

ఇప్పుడు సీఎం కేసిఆర్ ఆగష్టు 19వ తేదీ పై దృష్టి పెట్టాడు. ఆగష్టు 19 వ తేదీ నా తెలంగాణ రాష్ట్రం ప్రజలకు ఆయన కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. 19వ తారీఖున.. మీకు ఎలాంటి పనులు ఉన్న వాయిదా వేసుకోండి? ముఖ్యమంగా శ్రావణ మాసం కాబట్టి చాలా మంది పెళ్లిళ్లు చేసుకోవటానికి సిద్దమైతే.. వెంటనే మీ పెళ్లిని బంద్ చేయండి? లేదా ఆగస్టు 20 తేదీకి వాయిదా వేసుక్కొండి. పుణ్యకార్యం ఉందని, పక్కింటిల్లో పెళ్లికి ఉందని, తద్దినాలకు వెళ్లితే.. మీ జీవితం అంతే? మీరు తెలంగాణ గడ్డపై పుట్టి ఉంటే.. ఎక్కడికి పోకండని .. సీఎం కేసిఆర్ ఆదేశాలు జారీ చేయటం జరిగింది.

ఆగష్టు 19న తెలంగాణ రాష్ట్రంలో సర్వే చేస్తున్నారట. అందుకు ఆరోజు ఇళ్లు వదిలిపెట్టి పోకండని తెలంగాణ ప్రజలకు కేసిఆర్ సార్ పిలునిచ్చారు. ఆరోజు మీ ఇంటికి సర్వే అధికారి వస్తారు.. కాబట్టి, మీ ఇంటి విషయాలన్నీ చెప్పండి? ఇక అదే మీకు తెలంగాణ పౌరసత్వం అన్నట్లు గా గులాబీ సైన్యం చెబుతుంది. ‘ఆరోజు ఎవరైన చనిపోయి ఉంటే .. ఆగష్టు 20తేదీనే .. అన్నీ కార్యక్రమాలు జరపాలనే విధంగా తెలంగాణ సర్కార్ ప్రకటించింది.

అయ్యా కేసిఆర్ గారు...!!! మీ విదివిధానాలు .. బాగానే ఉన్నాయి. తెలంగాణ ప్రజల కోసం నిరంతరం కష్టపడటం చాలా బాగుంది. కానీ రైతుల రుణాల మాణీ సంగతి ఏం చేశావ్? తెలంగాణ రైతులు కరెంట్ కష్టాలతో అల్లాడిపోతున్నారు. కరెంట్ బాధలు పోవాలంటే.. ఆంధ్ర బాబుతో మాట్లాడి తెలంగాణ రైతులు కరెంట్ కష్టాలు లేకుండా చేయవచ్చు కదా!! ఆంధ్ర నేతల మీద పగతో తెలంగాణ రైతుల కంట్లో కన్నీరు చూస్తున్నావ్!! తెలంగాణలో ఒక మార్కు ఉండాలని పరితపించి పోతున్నావ్!! కానీ కరెంట్ లో తెలంగాణ రైతులు అల్లాడిపోతున్నారు. కరీంనగర్లో వరాలు కురిపించావ్!! వాటికి నాలుగు సంవత్సరాల సమయం పెట్టావ్! ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చటానికి.. సమయం సరిపోవటం లేదు? మళ్లీ కొత్త హామీలు ఎందుకని తెలంగాణ రైతులు అడుగుతున్నారు.

ఆగస్టు 19తేదీ తెలంగాణ ప్రజలకు షరతులు పెడుతున్నారు? వాటి ఫలితం ఎలా ఉంటుందో తెలియదు గానీ, తెలంగాణ ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఒకవేళ ఆగష్టు 19ఫలితం మరోలా ఉంటే మాత్రం .. కేసిఆర్ సర్కార్ పెద్ద దెబ్బ తగలటం ఖాయమని రాజకీయ నేతలు అంటున్నారు.

మీరు మాత్రం ఇళ్లు వదిలి వెళ్లకండి? ఎందుకంటే మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన అభివృద్ది కోసం కష్టపడుతున్న సీఎం కేసిఆర్ కు, తెలంగాణ అధికారులకు పూర్తి సహకారం అందిద్దాం!!

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana cm kcr  cm kcr august 19th  Telangana CM KCR  survey  telangana people  

Other Articles