Pakistan terrorists target narendra modi august 15

pm narendra modi latest news, pakistan terrorists, lushkar-e-toiba militant group, pakistan terrorists groups, indian independence day august 15, pm narendra modi flag hoisting yerrakota, delhi yerrakota, narendra modi flag hoisting, pakistan terrorist target narendra modi

Pakistan terrorists target narendra modi august 15 : Pakistan terrorists like lushkar-e-toiba and simi militant groups target pm narendra modi to kill him on Independence day august 15

ఆఖరికి నరేంద్రమోడీని పాకిస్తాన్ టార్గెట్ చేసేసింది.!?

Posted: 08/05/2014 01:29 PM IST
Pakistan terrorists target narendra modi august 15

చివరికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీని పాకిస్తాన్ ఉగ్రవాదులు టార్గెట్ చేసేశారు. ముస్లిములకు వ్యతిరేకంగా మోడీ ప్రచారాలు చేసి, హిందువుల ఓట్లతో నేడు భారత ప్రధానిగా గెలిచాడంటూ అప్పట్లో ఈయనమీద పాకిస్తాన్ వాసులు తీవ్రంగా నిరసనలు చేసిన విషయం తెలిసిందే! ముస్లిములను రెచ్చగొట్టే విధంగా మోడీ వ్యవహరిస్తున్నాడని మన భారత్ లో కూడా కొంతమంది నాయకులు విమర్శలు చేసిన విషయం కూడా విదితమే కానీ ఇవి వేరే విషయాలు! కానీ మోదీని మాత్రం పాక్ ఉగ్రవాదులు పక్కాగా టార్గెట్ చేశారన్న వార్తలు మాత్రం 100 శాతం నిజమేనని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తెలుపుతున్నాయి.

భారత స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15వ తేదీన భారత ప్రధాని మోడీని హతమార్చేందుకు పాకిస్తాన్ ఉగ్రవాద ముఠాలు వ్యూహాలు పన్నుతున్నారని ఇంటలిజెన్స్ వర్గాలు భారత హోం మంత్రిత్వ శాఖను అప్రమత్తం చేశాయి. మోడీ మీద నేరుగా దాడి చేసేందుకు పాక్ టెర్రరిస్టులు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారని సీనియర్ ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్వాతంత్ర్య వేడుకలను భగ్నం చేసేందుకు లష్కరే తోయిబా, సిమి వంటి మిలిటెంట్ గ్రూపులు ఢిల్లీలోని శివారు ప్రాంతాల్లో, వాణిజ్య సముదాయాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడే అవకాశం వుందని... ఈ నేపథ్యంలోనే ఎర్రకోట మీద కూడా దాడిచేసే అవకాశాలున్నాయని సమాచారాలు వెలువడుతున్నాయి.

అయితే ఈ దాడులను అడ్డుకునేందుకు, సదరు ముఠాల ఆచూకీ కనుక్కునేందుకు ఇంటలిజెన్స్ వర్గాలు ప్రయత్నిస్తున్నాయని అధికారులు తెలుపుతున్నారు. 26/11 తరహాలో మరోసారి విచ్చలవిడి కాల్పులు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా పూర్తి ప్రయత్నాలు చేస్తామని అధికారులు నమ్మకాన్ని కలిగిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles