Ys jagan mohan reddy replacing party head office to lotus pond

ys jagan mohan reddy, ys jagan latest news, ysr congress party head office, ysr congress party head office jubilee hills, ys jagan removing party telangana, ysr congress party leaders, ysr congress party ministers, ys jagan chandrababu naidu

Ys jagan mohan reddy replacing party head office to lotus pond : YSR Congress party president ys jagan mohan reddy replacing his party head office from jubilee hills to his home lotus pond to save money

తెలంగాణాలో జగన్ దుకాణ్ బంద్!!!

Posted: 08/05/2014 04:04 PM IST
Ys jagan mohan reddy replacing party head office to lotus pond

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్రంలో బంద్ చేస్తున్నట్టు స్వయంగా ఆయనే రంగంలోకి దిగి మరీ స్పష్టం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రంలో ఘోరంగా ఓటమి చవిచూసిన జగన్... ఇక్కడ తీవ్ర అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం ఖమ్మం మినహా మరేచోట ఈయన పార్టీ తన జెండాను పాతలేకపోయింది. దీంతో తన పార్టీ దుకాణాన్ని యావత్తు తెలంగాణాలోనే బంద్ చేయడానికి ఆయన సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు అధికారంలేని చోట పార్టీ కార్యాలయాలను పెట్టడం ఎటువంటి ప్రయోజనం లేదని భావించిన ఆయన... అన్ని కార్యాలయాలను ఖాళీ చేస్తున్నారు. ఎన్నికల్లో భారీగా ఓటమి ఎదుర్కున్న జగన్.. పార్టీ ఖర్చులను తగ్గించాలనే భావనతోనే కార్యాలయాలను ఖాళీ చేస్తున్నారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే జగన్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నెం.45లో వున్న తన వైఎస్సార్సీ ప్రధానా కార్యాలయాన్నీ ఖాళీ చేసే పనిలో పూర్తిగా నిమగ్నమైపోయారు. ఎందుకంటే.. కేవలం ఈ ఒక్క కార్యాలయానికే ప్రతినెలలా కోటి రూపాయల మేర అద్దెను చెల్లించాల్సి వస్తోందని... అంత డబ్బు ఖర్చు చేయడం కంటే ఆ కార్యాలయాన్ని ఖాళీ చేయడమే మంచిదని భావించిన తరుణంలో దాన్ని తప్పని పరిస్థితుల్లో ఖాళీ చేయాల్సి వస్తోంది పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల అనంతరం పొదుపు చర్యలను చేపట్టిన భాగంలోనే ఇలా భవనాన్ని ఖాళీ చేస్తున్నామని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం వున్న పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేసి... జగన్ నివాసముంటున్న లోటస్ పాండ్ కు మార్చనున్నారని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. లోటస్ పాండ్ సముదాయంలో ఓ బిల్డింగ్ ఖాళీగా వున్న నేపథ్యంలో... ఇకపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయాన్ని అక్కడే ఏర్పాటు చేయనున్నట్టు వారు స్పష్టం చేశారు. ఇదిలావుండగా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రాజధానిని ప్రకటించిన వెంటనే తమ ప్రధాన కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేసుకుంటామని వారు చెబుతున్నారు. అయితే.. జగన్ తన పార్టీ దుకాణాన్ని ఇక నుంచి తెలంగాణలో బంద్ చేస్తున్నారని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles