High court questioning t sarkar ts number plate

Hyderabad High court, andhra radesh high court, telangana high court, telangana government, high court fires ts number plate, high court questioning ts number plate, high court shocks t sarkar, cm kcr in problems, ck kcr latest news

High court questiong t sarkar TS number plate : Hyderabad High court questioning telangana government on TS number plate Which is t sarkar released GO on june 3rd

‘నెంబర్ ప్లేట్’ కేసులో టీ ప్రభుత్వానికి హైకోర్టు ఝలక్!

Posted: 08/05/2014 01:05 PM IST
High court questioning t sarkar ts number plate

విద్యార్థుల ఫీజు రాయితీ వ్యవహారంలో ‘‘1956 స్థానికత చెల్లదని’’ తెలుపుతూ... ఎంసెట్ కౌన్సిలింగ్ ను వెంటనే షురూ చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చి తెలంగాణ ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన విషయం తెలిసిందే! అయితే ఈ షాక్ నుంచి ఇంకా టీ-సర్కార్ కోలుకోకముందే.. హైకోర్టు మరో తీర్పుని ప్రకటించి ఇంకో ఝలక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం జూన్ నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపీ పేరిట జారీ చేసిన నెంబర్ ప్లేట్లను టీఎస్ పేరిట మార్చుకోవాలంటూ జీవో నెంబర్ 3ను జారీ చేసిన విషయం తెలిసిందే! అయితే దీనిపై హైకోర్టు, టీ-సర్కార్ ను ప్రశ్నించింది.

హైదరాబాద్ కు చెందిన రామ్మోహన్ రావు టీ-ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 3ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వాహనాలు యధేచ్ఛగా తిరుగుతున్నాయని.. 60ఏళ్ల కలిసి వుండి విడిపోయిన తర్వాత ఏపీ నెంబర్ ప్లేట్లతో వాహనాలు తిరగడానికి అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదని వాదించారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ‘‘అసలు ఇటువంటి జీవో జారీకి ఏ చట్టం అనుమతిస్తుందో తెలపాలి’’ అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ అంశంపై పూర్తి వివరాలను కోర్టు ముందు వుంచాలని తెలంగాణ రవాణా శాఖ న్యాయవాదిని ఆదేశించిన కోర్టు.. విచారణను వాయిదా వేసింది. మరి దీనిపై టీ-సర్కార్ ఎలా స్పందించనుందో..?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles