What are the benefits if chandrababu and kcr will become friends

ap cm chandrababu naidu, telangana cm kcr, chandrababu naidu kcr, chandrababu naidu shake hand kcr, kcr shake hand chandrababu naidu, chandrababu naidu met kcr at begumpet airport, chandrababu naidu kcr begumpet airport, kcr fires chandrababu naidu, chandrababu naidu fires kcr, chandrababu naidu latest press meet, kcr latest press meet

What are the benefits if chandrababu and kcr will become friends : If ap cm chandrababu naidu and telangana cm kcr will become friends together then two state people get lot of benefits in future about their improvement and cities

కేసీఆర్-బాబులు కలిస్తే.. మనకొచ్చే లాభాలు ఇవే..?

Posted: 08/05/2014 11:14 AM IST
What are the benefits if chandrababu and kcr will become friends

ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన రాష్ట్రాభివృద్ధిలో పూర్తిగా నిమగ్నమై వుంటే.. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ సిటీని ప్రపంచవ్యాప్తంగా గొప్ప సిటీగా నిర్మించే పనిలో పూర్తిగా మునిగిపోయారు. ఈ విషయాలను పక్కన వుంచితే... ఈ ఇద్దరు సీఎంలు ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఆగస్టు 2వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించే నేపథ్యంలో కరచాలనం చేశారే తప్ప... ఆ తరువాత మరెన్నడూ కలువలేదు. అంతే! అప్పుడు వారిమధ్య సంభాషణ ఏం జరిగిందో కానీ.. బయట మాత్రం తిట్టిపోసుకుంటూనే వున్నారు. ఒకరిమీద ఒకరు నిందలు వేసుకుంటూ తమ కోపతాపాలు పెంచుకుంటున్నారు గానీ.. రాష్ట్రాల సమస్యల్ని పరిక్షరించుకోవడానికి ఎటువంటి చర్చలు కొనసాగించలేదు.

ఈ ఇద్దరు సీఎంలు వ్యవహరిస్తున్న తీరును రాష్ట్రంలో వున్న నేతలతోపాటు సాక్షాత్తూ నరేంద్రమోడీ కూడా జోక్యం చేసుకుని వీరిమధ్య స్నేహం కలిగేలా ఎంత ప్రయత్నించినా... అది మాత్రం సాధ్యం కాలేదు. ఇద్దరు సీఎంలు కలిస్తేనే రాష్ట్రాభివృద్ధులకు సులభతరం అవుతుందని ఎంతమంది కేకలు పెట్టుకున్నా... వీరు మాత్రం కలవడానికి ససెమిరా అంటున్నారు. కానీ సహజంగా చెప్పుకోవాలంటే... వీరిద్దరూ కలిస్తే మాత్రం నిజంగానే మన రెండు తెలుగు రాష్ట్రాలను దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా పెద్ద అభివృద్ధి రాష్ట్రాలుగా తీర్చిదిద్దుకోవచ్చంటూ ప్రతిపక్ష నేతలతోపాటు అధికార పార్టీలో వున్న సొంత నేతలు కూడా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా వీరిద్దరి కలయికతో మొదట రైతుల రుణమాఫీలు పూర్తయిపోతాయి అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే.. వీరిద్దరు పోట్లాడుకోవడానికి చూసి కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది తప్ప.. కలపడానికి మాత్రం ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో వారు రుణాల గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పుడే ఈ ఇద్దరు సీఎంలు ఇలా గొడవపడుతుంటే.. భవిష్యత్తులో ఇంకెలా వ్యవహరిస్తారోనని వారు పేర్కొంటున్నారు. అయితే కలిసి మూకుమ్మడిగా కేంద్ర ప్రభుత్వంతో లేఖలు రాసి, చర్చలు జరిపితే మాత్రం రైతుల రుణమాఫీలు, మహిళల డ్వాక్వా గ్రూపులు వంటి సమస్యలు తేలికగా తీరిపోతాయని ప్రతిఒక్కరు స్పష్టం చేస్తున్నారు.

ఇక అభివృద్ధి విషయానికి వస్తే... తెలంగాణాలో కేవలం ఒక్క హైదరాబాద్ తప్ప.. మిగతా జిల్లాలన్ని వెనుకబడినవే! ఆంధ్రాలో విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందినా.. వాటికంత పేరు లేదు! అయితే ఈ అభివృద్ధి విషయంలో కూడా ఇద్దరు సీఎంలు పరస్పరం చర్చించుకుని నిధుల కేటాయింపుల విషయంలో వాటాలు పంచుకుంటే.. అభివృద్ధి చాలా సులభం అవుతుంది. ఒకవేళ అందులో లోటు ఏదైనా వచ్చినా... ఒకరికొకరు పంచుకోవడానికి వీలుగా వుంటుంది. ఇక వృద్ధులకు పెన్షన్లు, గ్రామీణాభివృద్ధి పథకాలు వంటివన్నీ పరస్పరం కూర్చొని చర్చించుకుంటే.. భవిష్యత్తులో వచ్చే నష్టాల పరిణామాలను కలిసి ఎదుర్కోవడానికి వీలుగా వుంటుంది.

కేవలం ఇవే మాత్రమే కాదు... విద్యుత్ కొరత, నీటిసమస్య, పారిశ్రామిక సంస్థలు, ప్రైవేటీకరణ సంస్థలు, విద్యార్థుల చదువులు, కొత్త ఉద్యోగాలు, కొత్త టెండర్లు, కొత్త పథకాలు, ఇంకా రకరకాల సమస్యలను చాలా సులభంగా అధిగమించుకోవచ్చు. ఇదంతా సాధ్యాం కావాలంటే.. దానికంటే ముందు ఇద్దరు సీఎంలు కలవడం ఖాయం కావాలని అందరూ చెబుతున్నారు. మరి ఈ విషయంపై ఈ ఇద్దరు సీఎంలు తమ అభిప్రాయాలను ఎప్పుడు వ్యక్తం చేస్తారో..? అసలు వీళ్లు కలుస్తారా..? లేదా తమ జీవితాంతం ఇలా నిందలు వేసుకుంటూ వుంటారా..? గురుశిష్యుల మధ్య శత్రుత్వం వుండటం వారి నైజం కానీ.. దాని ప్రభావం మాత్రం ప్రజల మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ నాయకులందరూ కోరుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles