Demolition of irregular constructions in hyderabad

demolition of irregular constructions, irregular constructions in hyederabad, akkineni nagarjuna n covention hall, ghmc recognizes 890 irregular constructions

demolition of irregular constructions

మంగళవారం నుండి మరో 170 కట్టడాలకు ముప్పు

Posted: 07/14/2014 04:13 PM IST
Demolition of irregular constructions in hyderabad

హైద్రాబాద్ మొత్తంలో గ్రేటర్ మున్సిపల్ అథారిటీ 890 అక్రమ నిర్మాణాలను గుర్తించింది.  అందులో హెచ్చు స్థాయిలో నియమాలను ఉల్లంఘించిన కట్టడాలను మంగళవారం నుంచి కూల్చివేతలకు గురిచేద్దామని అందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.  

ఏ భవనం ఎప్పుడు కూలుతుందో ఎవరు ఎప్పుడు రోడ్డున పడతారో అని ముందు నుంచే అక్రమ నిర్మాణాలు జరిగాయని తెలిసి, ఆఁ చూద్దాంలే ఆ సమయం వచ్చినప్పుడు, అంత త్వరగా నిర్ణయమేమీ జరగదులో, నోటీసులు వచ్చినా కోర్టులున్నాయి వాటిని జాప్యం చెయ్యటానికి అని ధైర్యంగా ఉన్నవాళ్ళంతా గురుకుల ట్రస్ట్ లో అక్రమ నిర్మాణాలు, అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయటం జరిగిన నేపథ్యంలో భయపడుతున్నారు.

నియమాలను ఉల్లంఘించినవారిని ఉపేక్షించవద్దు, ప్రభుత్వ భూమిని అరంగుళం కూడా వదలొద్దు అన్న తెలంగాణా ముఖ్యమంత్రి మాటలతో ప్రేరితమైన మున్సిపల్ అథారిటీ ఎప్పుడు అదాటున మీదపడుతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న చూస్తున్నారు కొన్ని అక్రమ కట్టడాలలో ఉన్నవారు.

అంత కోర్టుకి పోయి స్టే తెచ్చుకున్న అక్కినేని నాగార్జున కూడా ఎన్ కన్వెన్షన్ లో కొన్ని నిర్మాణాలను స్వయంగా కూల్చివేస్తున్నారని వచ్చిన వార్తలను విన్నతర్వాత చాలామందిలో అంతకు ముందున్న కొద్దిపాటి ధైర్యం కూడా వాళ్ళని వీడిపోయింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles