జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన మీద వస్తున్న వార్తల దృష్ట్యా హెచ్చరికలను జారీచేసారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికోసం తన పేరును వాడుకుంటూ కొందరు నిధులను కూడగడుతున్నారని తెలిసిందని, తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని, అటువంటి వారిని ఉపేక్షించేది లేదని, అటువంటివారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసివస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు.
తను సైలెంట్ గా ఉండటం మీద కూడా కొందరు వ్యాఖ్యానాలు చేసారని, అయితే తను కేవలం జనసేన పార్టీకి అధికారికంగా లభించే గుర్తింపు కోసమే ఎదురుచూస్తున్నానని, ఆ తర్వాత తన పార్టీ విధివిధానాలను తెలియపరుస్తానని అన్నారు. ఈలోపులో తన పేరును కానీ పార్టీ పేరును కానీ ఉపయోగిస్తూ ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ గట్టిగా హెచ్చరించారు. రాజధానికోసం నిధులను పోగుచెయ్యమని తానెవరికీ చెప్పలేదని, అందుకు ఎవరినీ నియమించలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.
2014 ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వాన్ని స్థాపించటానికి భారతీయ జనతా పార్టీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలవటం కోసం పవన్ కళ్యాణ్ పాటుపడ్డారు. అయితే ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పెదవి విప్పి, తన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more