Congress leader jairam ramesh speaks on polavaram ordinance in rajya sabha

Jairam Ramesh Speaks on Polavaram Ordinance, Jairam Ramesh, Jairam Ramesh Polavaram Ordinance, Polavaram Ordinance, Jairam Ramesh on Polavaram project, Polavaram Project.

Congress leader Jairam Ramesh Speaks on Polavaram Ordinance in Rajya Sabha, Jairam Ramesh on Polavaram project

ఏపీ వరం జోలికి వెళ్లితే తాటతీస్తాం! జైరాం రమేష్

Posted: 07/14/2014 04:42 PM IST
Congress leader jairam ramesh speaks on polavaram ordinance in rajya sabha

పోలవరం పై తెలుగు రాష్ట్రాల మద్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే పోలవరంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ , పోలవరం బిల్లు అడ్డుకొనే వారికి వార్నింగ్ ఇచ్చారు. పోలవరం జోలికి వెళితే తాటతీస్తాం? అని ఘాటుగా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మీరు అమలు చేయాలని జైరాం రమేష్ పేర్కొన్నారు. రాజ్యసభలో ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు (పోలవరం ముంపు గ్రామాలు ఏపీలో విలీనం)పై చర్చ జరుగుతోంది. ఈ చర్చలో పాల్గొన్న జైరాం రమేష్ అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా తటస్థంగా మాట్లాడారు. ఏడు ముంపు మండలాల ప్రజల భయాలను తొలగించాల్సినసవరం ఉందని, ఈ ముంపు మండలాల ప్రజలకు ఏపీ ప్రభుత్వం పునరావసం కల్పిస్తుందన్నారు.

పోలవరం డిజైన్ మార్చడం కష్టమని పేర్కొన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ విభజన బిల్లును ఆమోదించిందని గుర్తు చేశారు. 28 ఫిబ్రవరి 2014 వెంకయ్య నాయుడు తో దీనిపై మాట్లాడడం జరిగిందని తరువాత మార్చి 1 గెజిట్ అయ్యిందని తెలిపారు. దీనికి సంబంధించిన కొన్ని తీర్మానాలు చేయడం జరిగిందని చదివి వినిపించారు.

పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు అని చెప్పుకొచ్చారు. 7 లక్షల ఎకరాలకు నీరు అందిస్తుందని అలాగే 960 మెగావాట్ల విద్యుత్ అందిస్తుందన్నారు. అంతేగాకుండా 23 టిఎంసీల తాగునీరు విశాఖపట్టణానికి అందుతుంది. దీనికి 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుండగా 32 శాతం ఇప్పటికే ఖర్చు చేశామని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వల్ల 45 వేల పునరావాసం కల్పించాల్సి ఉంటుందని అంతేగాకుండా మల్కన్ గిరి, ఛత్తీస్ గఢ్ లో ఉన్న ప్రజలకు కూడా పునరావసం కల్పించాల్సి ఉంటుందని సూచించారు. జైరాం రమేష్ ప్రసంగాన్ని పలుమార్లు తెలంగాణ ఎంపీ వీహెచ్ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీనికి డిప్యూటి ఛైర్మన్ కురియన్ సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. కేవలం జైరాం మాట్లాడే అంశాలు రికార్డు అవుతాయని ఇతర మాటలు రికార్డు కావని తేల్చిచెప్పారు.

అయితే జైరాం రమేష్ వార్నింగ్ తో..తెలంగాణ కాంగ్రెస్ నేతలు షాక్ తిన్నారు. టీఆర్ఎస్ నేతల కూడా ఖంగుతిన్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రస్తాయిలో జైరాం రమేష్ మండిపడుతున్నారు. కానీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన స్ర్కిప్ట్ ప్రకారమే రాజ్యసభలో జైరాం రమేష్ చదివినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి వెనక నుయ్యి, ముందు గొయ్యి అన్న మాదిరిగా మారిపోయింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోలవరం పై మౌనం పాటించక తప్పలేదు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles