Paripurnanda swamy objects sale of prasadam

paripurnanda swamy objects sale of prasadam, prasadam selling is bad culture sripeetham swamy says, sripeetham paripurnananda sway on commercializing prasadam

paripurnanda swamy objects sale of prasadam

తీర్థం అమ్ముతారా, ప్రసాదం ఎందుకు అమ్ముతారు?

Posted: 07/14/2014 02:54 PM IST
Paripurnanda swamy objects sale of prasadam

దేవాలయాల దగ్గర తీర్థం ఎలాగైతే అమ్మరో అలాగే ప్రసాదం కూడా అమ్మటం సరికాదని స్వామి పరిపూర్ణానంద అన్నారు.

శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద మొదటిసారిగా ప్రసాద విక్రయాల మీద గళం విప్పారు.  ఇంతవరకు మిగిలినవాళ్ళందరూ చూస్తూ ఊరుకున్నారు, ఆలయాల్లో ఇతర అంశాల మీద వ్యాఖ్యానించారు కానీ ప్రసాద విక్రయాల మీద మాట్లాడలేదు.  

అసలు ప్రసాదం అంటే ఏమిటి?

ఆలయాల్లో ప్రతిష్టించిన దేవి దేవతా విగ్రహాలకు నైవేద్యం పెట్టి దాన్ని భక్తులకు వితరణ చేసేది.  దాన్ని దైవ ప్రసాదంగా భావిస్తారు.  

కానీ దేవాలయాలు ఆదాయం పెంచుకునే దిశగా ప్రసాదాలను విడిగా తయారు చేసి వాటిని విక్రయిస్తున్నారు.  ప్రసాద వితరణ సరైనదే కానీ ప్రసాద విక్రయం వక్ర సంస్కృతి.  విక్రయించేంత ప్రమాణంలో తయారు చెయ్యటమంటే దాన్ని వ్యాపార పద్ధతిలో అధిక ప్రమాణంలో ఉత్పత్తి చెయ్యవలసివుంటుంది.   అటువంటి పదార్థం గర్భాలయంలోకి పోదు.  నేరుగా వంటశాల నుంచి విక్రయశాలకు వెళ్ళి చేరుతుంది.  కేవలం అది ఆలయ ఆవరణలో ఆలయ నిర్వాహకులు అందిస్తున్నారన్నదొక్కటే అందులో ఉన్న విశేషం కానీ అది దైవ ప్రసాదం అనుకోవటానికి వీల్లేదు.  

ప్రాచీన పవిత్ర మహిమాన్వితమైన క్షేత్రంగా భావించే తిరుమలలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వితరణ, విక్రయాలలో వివిధ విధానాలను అవలంబిస్తోంది.  కొందరికి ఉచితంగాను, కొనే లడ్డూల సంఖ్యను బట్టి ధరలలో మార్పులను చేస్తూ యంత్ర సాయంతో తయారు చేసే లడ్డూని వితరణ చేస్తోంది.  

ఆలయంలోపల కొన్ని సమయాలలో ఉచితంగా వితరణ చేసే పొంగలి, చక్రపొంగలి, పులిహార లాంటి ప్రసాదాలను మినహాయించి విక్రయశాలలకు నేరుగా వెళ్తున్న లడ్డూలు అసలు ప్రసాదమే కాదు కాబట్టి దాన్ని విక్రయించి ఆలయ ఆదాయాన్ని పెంచుకోవటంలో తప్పేమీ లేదని కూడా కొందరి అభిప్రాయం.  ఆలయాన్ని వచ్చే ఆదాయం తిరిగి భక్తుల సౌకర్యాల కోసం, ఆలయ నిర్వహణ కోసం ఖర్చు పెట్టటం జరుగుతుంది కాబట్టి ఆసక్తిగలవారు ప్రసాదాలు అని పేరు చెప్పుకుని వాటిని కొనుక్కోవటం వలన ఏదో అపరాధం చేసినట్లు కానీ, లేదా స్వామివారు సెలవిచ్చినట్లుగా ఏదో అరిష్టం జరుగుతుందని కానీ భయపడాల్సిన పనైతే లేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles