Congress leader shabbir ali fires on cm kcr

Congress Leader Shabbir Ali Fires On cm kcr, Shabbir Ali Fires On cm kcr, Congress Leader Shabbir Ali, polavaram bill, trs government, cm kcr,

Congress Leader Shabbir Ali Fires On cm kcr

సీఎం కేసీఆర్ ను ప్రశ్నించిన అలీ!

Posted: 07/14/2014 02:43 PM IST
Congress leader shabbir ali fires on cm kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీరు ను గట్టిగా ప్రశ్నించిన అలీ. మీరు ఇచ్చిన హమీలను ఎలా మరిచిపోయారు అని సీఎం కేసిఆర్ ను అలీ నిలదీశారు. అలీ అంటే .. సినీ నటుడు అలీ కాదులేండి? ఈ అలీ కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత షబ్బీర్ అలీ. ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపరాదంటూ కేసీఆర్ ఎందుకు ఢిల్లీ వెళ్లలేదని ప్రశ్నించారు.

హస్తిన వెళ్లకుండా మోహం ఎందుకు చాటేశారని నిలదీశారు. పోలవరంపై ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకువెళతానన్న కేసీఆర్ హామీ ఏమైందన్నారు. షబ్బీర్, అసలు పోలవరం ఆర్డినెన్స్ ను ఆపేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నాలేమిటని సూటిగా అడిగారు. 1956కు ముందున్న ప్రాంతాలనే తెలంగాణలో కలపాలని కోరడం వల్లనే ముంపు గ్రామాలు ఆంధ్రాలోకి వెళుతున్నాయని అన్నారు.

అటు ఈ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి వైఖరిని సీపీఐ కూడా నిలదీసింది. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు ఎందుకు వెనకాడుతున్నారని ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో అందరినీ సమన్వయం చేయాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉందన్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles