Bride s barat goes to groom s house in bihar

Bride's barat goes to groom's house in Bihar, Barat by bride, Bride goes to groom for marriage, Bihar incident of bride’s barat

Bride's barat goes to groom's house in Bihar

వరుడి ఇంటికి వెళ్ళిన వధువు బారాత్!

Posted: 07/12/2014 06:11 PM IST
Bride s barat goes to groom s house in bihar

భారత దేశంలో ఏ ప్రాంతంలోనైనా పెళ్ళి చేసుకోవటానికి వరుడు వధువు ఇంటికి వెళ్ళటం ఆనవాయితీగా వస్తోంది.   కొన్ని ప్రాంతాలలో అలా తరలి వెళ్ళే వరుడి బృందాన్ని బారాత్ అంటారు.  ప్రాంతాన్నిబట్టి బారాత్ లో గుర్రం మీద ఎక్కి రావటం, తలకి పూలతో చేసిన ముసుగు కానీ, తలపాగా కానీ బాషికం కాని కట్టుకోవటం లాంటివి, చేతిలో కత్తి పట్టుకోవటం, బారాత్ ముందు సంతోషాతిశయంతో డ్యాన్స్ లు చెయ్యటం జరుగుతాయి.  దానికి ముందు పెళ్ళి కొడుకు వేరే ప్రదేశం నుంచి వచ్చినట్లయితే వాళ్ళందరికీ విడిది ఏర్పాట్లు చెయ్యటం జరుగుతుంది.

కానీ అందుకు విరుద్దంగా జరిగింది బీహార్ రాష్ట్రంలోని మావోయిస్ట్ లు ముమ్మరంగా కార్యకలాపాలు చేపట్టే షైక్ పురా జిల్లా ఖైర్ గ్రామంలో.   వధువే పెళ్ళి కోసం వరుడి ఇంటికి బారాత్ తో పోయింది.

ఇది జరిగింది ఇలా-

షైక్ పురా జిల్లా మార్వాడీ టోలాకి చెందిన చందన్ కుమార్ కి దాని పొరుగు జిల్లా జామూయి లో ఖైర్ గ్రామానికి చెందిన వీణా కుమారికి పెళ్ళి నిశ్చయమైంది.  ఈ పెళ్ళి జరిపించటానికి ఇరు కుటుంబాలలోని పెద్దలు బుధవారం నాడు శుభముహూర్తాన్ని నిర్ణయించారు.  ఏర్పాట్లన్నీ జరిగాయి.  వివాహవేడుకను తిలకించటానికి బంధుజనమంతా విచ్చేసింది. కానీ అసలు రావలసిన పెళ్ళికొడుకు జాడ లేదు.  కారణమేమిటా అని విచారిస్తే అతగాడు అంతకు ముందు రోజు అడిగిన అదనపు కట్నం ఇవ్వటానికి పెళ్ళికూతురు కుటుంబం అంగీకరించలేదు.  

అంతే ఆ తెల్లవారి పెళ్ళి కూతురే బారాత్ తో పెళ్ళి కొడుకు ఇంటికి వెళ్ళి పెళ్ళి చేస్తారా లేదా అని కూర్చుంది.  ఈ విషయాన్ని పోలీసులకు కూడా చెప్తామని బెదిరించటం జరిగింది.

ఈ గందరగోళం చూసి పెళ్ళి కొడుకు ఉడాయించటానికి ప్రయత్నం చెయ్యగా గ్రామస్తులు అతగాడిని పట్టుకుని పెళ్ళి మండపానికి తీసుకునివచ్చారు.  పెళ్ళి కూతురు తండ్రి సంజయ్ రామ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పెళ్ళి జరిపించటానికి సహకరించిన స్థానికులకు కృతజ్ఞతలు తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles