కాలిఫోర్నియాలో యాహూ ఇంక్ లో ఉన్నతస్థాయి ఎగ్జిక్యూటివ్ మీద ఉద్యోగి లైంగిక అత్యాచారానికి ఒడిగట్టినట్లుగా మరో మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసారు.
యాహూ మొబైల్ లో డైరెక్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ గా పనిచేస్తున్న మరియా ఝాంగ్ మీద ఫిబ్రవరి 2013 నుంచి ప్రిన్సిపాల్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసిన నాన్ షి జూలై 8 న కాలిఫోర్నియాలో శాన్ జోస్ లో ఉన్న శాంటా క్లారా సుపీరియర్ కోర్ట్ లో కేసు ఫైల్ చేసారు.
షి చేసిన అభియోగంలో ఝాంగ్ ఎన్నోసార్లు కాలిఫోర్నియాలో సన్నీ వేల్ లో తనతో లైంగిక చర్యలో పాల్గొనమని, దాని వలన షి భవిష్యత్తు ఎంతో బావుంటుందని చెప్తూ ఓరల్, డిజిటల్ సెక్స్ కోసం ప్రేరేపించిందని అన్నారు. అందుకు పరిహారంగా డబ్బుతోపాటుగా దోషిని శిక్షించాలని కూడా షి తన ఫిర్యాదులో కోరారు.
తను చేసిన పనిని పనికట్టుకుని 2013 లో రెండవ, మూడవ క్వార్టర్లలో తక్కువ చేసి చూపించటం చేసిందని, ఈ విషయాన్ని హెచ్ ఆర్ దగ్గరికి తీసుకునిపోయి, ఝాంగ్ చేస్తున్న లైంగిక వేధింపుల మీద, చూపిస్తున్న వివక్ష మీద దర్యాప్తును కోరగా, అదేమీ చెయ్యలేదు సరిగదా తనని జీతం లేని సెలవులో పంపించి చివరకు పనిలోంచి కూడా తీసేసారని షి కోర్టు కేసులో పేర్కొన్నారు.
అయితే ఇదంతా నిరాధారమైన ఆరోపణలని, అందులో సత్యం లేదని, ఝాంగ్ మీద పడ్డ మచ్చను చెరిపివేయటానికి న్యాయపోరటం చేస్తామని కంపెనీ ప్రతినిధి అన్నారు. ఎలైక్ పేరుతో ఝాంగ్ స్థాపించిన మొబైల్ కంపెనీని 2013 లో యాహూ కొనుగోలు చేసింది. యాహూలో ఆమె చేరటానికి ముందుగా మైక్రోసాఫ్ట్ లోను జిల్లో సంస్థలోనూ కూడా పనిచేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jul 06 | ఆండ్రాయిడ్ ఫోన్లకు కొత్త మాల్వేర్ తో ముప్పు పొంచి ఉందని ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ఆ మాల్వేర్ పేరు టోల్ ఫ్రాడ్. పేరులోని ఫ్రాడ్ కు తగ్గట్టుగానే ఇది మహా... Read more
Jul 06 | దేశీయ వ్యాపార దిగ్గజం, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. సమకాలిన అంశాలతో స్పందిస్తూ రకరకాల పోస్ట్‌లను షేర్ చేయడమే కాదు. నెటిజన్లకు అడిగిన ప్రశ్నలకు రిప్లయి... Read more
Jul 06 | చుట్టూ నీళ్లు..మధ్యలో స్థంభం.. ఆ స్థంభం వద్దకు వచ్చిన ఓ ఆవు కరెంట్ షాక్‌తో గిలగిలా కొట్టుకుంది. ఇది చూసి ఓ దుకాణ యజమాని చలించిపోయాడు. వెంటనే ప్రాణాలకు తెగించి ఆ ఆవును కాపాడాడు.... Read more
Jul 06 | దేశీయంగా, అంతర్జాతీయంగా విమానయాన సేవలను ప్రయాణికులకు కల్పిస్తున్న స్పైస్ జెట్ విమానాయాన సంస్థ గతకొన్ని రోజులుగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోంటోంది. తమ సంస్థకు చెందిన విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో... Read more
Jul 06 | హిమాచల్ ప్రదేశ్‌లో కుంభవృష్టి కురిసింది. కులు జిల్లాలోని పర్వతి లోయలో ఉన్న చోజ్ ముల్లా వద్ద అకస్మాత్తుగా క్లౌడ్‌బస్ట్ అయ్యింది. ఈ ఘటన వల్ల స్థానిక గ్రామాల్లో భారీ నష్టం సంభవించింది. చోజ్ గ్రామంలో... Read more