Where babu is going to sleep for three nights

Chandrababu 3nights, babu three nights sleeping, Andhrapradesh, telangana, ap, andhrapradesh cm chandhrababu naidu, state divided,

where babu is going to sleep for 3 nights, Chandrababu 3nights, babu three nights sleeping,

చంద్రబాబుగారు ఆ మూడు రాత్రులెప్పుడు..?

Posted: 07/05/2014 06:06 PM IST
Where babu is going to sleep for three nights

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పై 6కోట్ల మంది ప్రజల దృష్టి ఉంది. ఆయన కోసం సీమాంద్ర ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారు ఆ మూడు రాత్రులు ఎక్కడ నిద్రచేస్తారా అని , ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, ఆంద్రప్రజలు చకోర పక్షుల్ల ఎదురుచూస్తున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అయినా... కొత్తగా ఏర్పడాల్సింది ఆంద్రప్రదేశ్. హైదరాబాద్ తెలంగాణకు చెందడంతో.. ఏపీకి రాజధాని ఎక్కడనేది అంతు చిక్కని సమస్యగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు.. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఏపీని సింగపూర్ లా చేస్తానన్న బాబు.. హైదరాబాద్ లో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. వారానికి మూడు రోజులు ఏపీలోనే ఉంటానంటూ మాట ఇచ్చారు. గుంటూరు – విజయవాడ మధ్య ఉన్న నాగార్జున యూనివర్సిటీలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు సీఎంకు అందుబాటులో ఉండేందుకు అన్ని శాఖల ముఖ్య అధికారులు మకాం ఏర్పాట్లకు సిద్ధమయ్యారు.

మే 8న లక్షలాది మంది సమక్షంలో సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. నెలరోజులు గడిచాయి. కానీ ఇప్పటివరకు ఒక్క నిద్ర కూడా ఏపీలో చేయలేదు. సీఎం విడిది కోసం విజయవాడలో స్టేట్ గెస్ట్ హౌస్ కు 45 లక్షల ఖర్చుతో హంగులద్దారు. కానీ సీఎం ఇప్పటివరకు అక్కడకు రానే లేదు. దీంతో సీఎం మూడు రాత్రుల ముచ్చట తీరడం లేదు. మరోవైపు రాజధాని ఎక్కడో తెలియక అధికారులకు సైతం స్పష్టత రావడం లేదు.

సీఎం మూడురాత్రుల ముచ్చట తీర్చుకుంటే.. మంత్రులు, అధికారులు పరుగులు తీయడం ఖాయం. ఫైళ్లు కూడా స్పీడ్ గా కదులుతాయి. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో పని మొదలవుతుంది. రాజధాని కూడా ఎక్కడతో త్వరగా డిసైడ్ అవుతుంది. 

ఆంధ్రప్రదేశ్ లో సీఎం క్యాంపు కార్యాలయం డిసైడ్ అయి.. వారానికి మూడు రోజులు ఇక్కడే ఉంటానన్న సీఎం మాటలు ఆచరణలో పెడితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అడుగు ముందుకు పడుతుంది. మరి సీఎం గారి ఆ మూడు రాత్రుల ముచ్చట ఎప్పుడు తీరుతుందో చూడాలి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles